యువతపై కరోనా పడగ

ABN , First Publish Date - 2020-07-09T12:07:01+05:30 IST

కాశినాయన మండలం నరసాపురంలో సచివాలయ నిర్మాణ సందర్భంగా జరిగిన సంఘటనలో టీడీపీ నాయకులు..

యువతపై కరోనా పడగ

కరోనా బారిన పడిన వారిలో యువతే అధికం

 747 మందికి పాజిటివ్‌

ఆ తరువాతి స్థానంలో నడివయసు వారు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..

మరో 68 కేసులు 

115 మంది డిశ్చార్జి 

కడపపై కరోనా కన్నెర్ర  


పోరుమామిళ్ల / కాశినాయన, జూలై 8 : కాశినాయన మండలం నరసాపురంలో సచివాలయ నిర్మాణ సందర్భంగా జరిగిన సంఘటనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన  టీడీపీ నేతలు కర్నాటి సుబ్బారెడ్డి, ప్రతా్‌పరెడ్డితో పాటు పోరుమామిళ్ల, బి.కోడూరు పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఉన్న టీడీపీ సానుభూతి పరులైన మహిళలను ఆయన పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సచివాలయ నిర్మాణంలో మహిళలు భావోద్వేగంతో తమ వాదనలు వినిపించారని, కానీ వైసీపీ నాయకులు తమ అధికార దర్పాన్ని చూపించి అహంకారంతో కక్ష సాధింపు చర్యగా అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు.    కార్యక్రమంలో బద్వేలు మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ రంతు పాల్గొన్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): మేమంతా యువకులం.. రోగ నిరోధక శక్తి దండిగా ఉంది.. కరోనా మమ్మల్ని ఏమీ చేయలేదు అనుకుంటున్నారా..? అలాంటి నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఎందుకంటే యువతే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలో నమోదైన  పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే.. 21 నుంచి 40సంవత్సరాల వయసులోపు 747 మంది పాజిటివ్‌ బారిన పడ్డారు. అంటే సగం కేసులు యువతవే కావడం గమనార్హం. యువకుల్లో రోగనిరోధక శక్తి ఉంటుంది. పాజిటివ్‌ బారిన పడ్డా వెంటనే కోలుకుంటున్నారు. కరోనా కూడా యువతనే ఆస్వాదిస్తున్నట్లుంది. జిల్లాలో బుధవారం నాటికి 1575 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలించిన తరువాత జూన్‌, జూలైలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.


రాకపోకలు పెరగడం, వాణిజ్య సంస్థలు తెరుచుకోవడంతో ఎక్కువయ్యాయి. జనం కూడా భౌతిక దూరం పాటించడం లేదు. తొలుత కరోనా కట్టడికి అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ సడలింపు తరువాత చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు నిర్వహించే కార్యక్రమాల్లో అయితే భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. ఇది కరోనా వ్యాప్తికి తలభారంగా మారింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కొవిడ్‌-19 ఆసుపత్రులు నిండుతున్నాయి.


వయస్సుల వారీగా పరిశీలిస్తే..

జిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 20 సంవత్సరాల్లోపు వారిలో 220 మందికి పాజిటివ్‌ సోకింది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య 740 మందికి, 41 నుంచి 60 సంవత్సరాల్లోపు 463 మందికి, 60సంవత్సరాలు పైబడిన వారిలో 140 మంది వైరస్‌ బారిన పడ్డారు. సో.. దీన్ని బట్టి చూస్తే కరోనాకు యువకులు బాగా దొరుకుతున్నట్లు అర్థమవుతోంది. యువత బయట తిరుగుతుండడం వల్ల వారికి సోకిన వైరస్‌ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకూ వ్యాపిస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అవసరం ఉంటేనే బయటికి వెళ్లండి.. లేకుంటే ఇంట్లోనే ఉండండి.


కడపపై కరోనా కన్నెర్ర.. మరో 68 కేసులు 

కడప కార్పొరేషన్‌పై కరోనా కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. రెండు రోజులు శాంతించినట్లు కనిపించినా బుధవారం మాత్రం జిల్లాలో 68 కేసులు నమోదైతే కడపలోనే 41 నమోదు కావడం గమనార్హం. నగరంలోని నబీకోట, బెల్లంమండీవీధి, ట్రంకురోడ్డు, మరియాపురం, అగాడి, రవీంద్రనగర్‌, చిన్నచౌకు, ఆర్‌కేనగర్‌, ద్వారకానగర్‌, ఎన్జీవో కాలనీ, నెహ్రూనగర్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 9, వేంపల్లె 5, పోరుమామిళ్ల 4, పులివెందుల 3, చెన్నూరు 1, బి.మఠం 1, చాపాడు 1, రైల్వేకోడూరు 1, లక్కిరెడ్డిపల్లె 1, రాయచోటిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1575కు చేరింది. 


115 మంది డిశ్చార్జి

కొవిడ్‌-19 నుంచి సంపూర్ణంగా కోలుకున్న 115 మందిని జిల్లా కొవిడ్‌-19 ఆసుపత్రి నుంచి బుఽధవారం డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు సి.హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు 664 మందిని డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు.

Updated Date - 2020-07-09T12:07:01+05:30 IST