కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ‘కరోనా’బీర్ ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-04-03T21:07:40+05:30 IST

కరోనా.. ఈ పేరు మనకు ఇప్పుడు తెలుసు కానీ, చాలా మందికి ఎప్పటినుంచో తెలుసు, అయితే వైరస్ రూపంలో కాదు. చల్లటి బీర్ రూపంలో..

కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ‘కరోనా’బీర్ ఉత్పత్తి

మెక్సికో సిటీ: కరోనా.. ఈ పేరు మనకు ఇప్పుడు తెలుసు కానీ, చాలా మందికి ఎప్పటినుంచో తెలుసు, అయితే వైరస్ రూపంలో కాదు. చల్లటి బీర్ రూపంలో.. అవును, మెక్సికో కేందంలో గ్రూపో మొడేలో అనే కంపెనీ కరోనా పేరుతో ఓ బీర్‌ను ఏళ్లుగా తయారు చేస్తోంది. అయితే ఇప్పుడు అదే పేరుతో ఓ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని వణికించడమే కాకుండా.. ఆ బీర్ కంపెనీ తమ ఉత్పత్తినే నిలిపివేసేలా చేసింది. 


కరోనా వైరస్ భయంతో అనేక దేశాలు ఇప్పటికే దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు ప్రకటించేశాయి. కేవలం నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఉత్పత్తి, అమ్మకాలను మాత్రమే ఆయా దేశాల ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీర్ ఉత్పత్తి ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసరాల జాబితాల లేదని, అందువల్ల తమ బీర్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తయారీ కంపెనీ ‘గ్రూపో మొడేలో’ ప్రకటించింది.


అయితే బీర్ ఉత్పత్తిని వ్యవసాయంగా పరిగణించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లయితే తాము తిరిగి పని ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది. అంతేకాకుండా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 75 శాతం మంది ఇంటి నుంచే పనిచేసేలా ప్రణాళిక కూడా రూపొందిస్తున్నామని గ్రూపో మొడేలో యాజమాన్యం పేర్కొంది.

Updated Date - 2020-04-03T21:07:40+05:30 IST