భువనగిరి పీఎస్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-08T22:26:52+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఖాకీలను కూడా వైరస్ వదలట్లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు పోలీసులు కరోనాతో

భువనగిరి పీఎస్‌లో కరోనా కలకలం

యాదాద్రి: కరోనా మహమ్మారిపై పోరాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఖాకీలను కూడా వైరస్ వదలట్లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు పోలీసులు కరోనాతో మృతి చెందారు. భువనగిరి పీఎస్‌లో కరోనా కలకలం రేగింది. భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీస్‌స్టేషన్‌ను శానిటైజర్ చేశారు. 


ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. అయినా పోలీసులు విధులు నిర్వర్తించక తప్పదు. పోలీసులు విధుల్లోకి వచ్చారంటే గస్తీ నిర్వహించాలి. వాహనాలను తనిఖీ చేయాలి. నేరగాళ్లను అరెస్టు చేయాలి. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట కరోనా సోకే అవకాశాలు ఉంటాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయినా తమ జాగ్రత్తల్లో తాము ఉంటున్నామని పోలీసులు చెబుతున్నారు. అందుకే సిబ్బందికి విధుల్లోకి వచ్చినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పదేపదే ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఒక పోలీసు పాజిటివ్‌తో క్యారంటైన్‌కు వెళ్తే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి ఉంటుందని వాపోతున్నారు.

Updated Date - 2020-07-08T22:26:52+05:30 IST