Abn logo
May 5 2021 @ 10:01AM

కరోనాతో అన్నదమ్ముల మృతి

అన్న మరణవార్త విని తమ్ముడు కూడా


పలమనేరు: కరోనా మహమ్మారి అన్న దమ్ములిద్దరినీ మింగేసిన ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో మంగళవారం చోటుచేసుకొంది. తొప్పనపల్లె కు చెందిన అన్నదమ్ములు మాధవ్‌ (46),మంజు (36) బెంగళూరులో ఆడిటర్లుగా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు.ఈ క్రమంలో మాధవ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అన్న మృతి చెందిన విషయాన్ని సోమవారం ఉదయం మంజుకు తెలిపారు. అన్న చనిపోయాడన్న బెంగతో మంజు కాసేపటికి తుది శ్వాస విడిచాడు.అన్నదమ్ముల మృతితో తొప్పనపల్లెలో  విషాదఛాయలు అలుముకున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement