ఒక్కరోజులో భారీగా...

ABN , First Publish Date - 2022-01-15T06:23:42+05:30 IST

జిల్లాలో కరోనా అలజడి రేపుతోంది. థర్డ్‌వేవ్‌ వైరస్‌ వేగంగా జనంపై విరుచుకుపడుతోంది.

ఒక్కరోజులో భారీగా...

కరోనా కేసులు.. 300

ఒక్కరోజులో భారీగా...

36 మండలాల్లో వైరస్‌ ప్రభావం

హాట్‌స్పాట్‌గా అనంత.. 

నగరంలో 105 మందికి పాజిటివ్‌

అనంతపురం వైద్యం, జనవరి14: జిల్లాలో కరోనా అలజడి రేపుతోంది. థర్డ్‌వేవ్‌ వైరస్‌ వేగంగా జనంపై విరుచుకుపడుతోంది. జిల్లాలో ఒక్క రోజులోనే అనూహ్యంగా 300 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. అది కూడా.. 36 మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవడం మరింత టెన్షనకి గురిచేస్తోంది. ప్ర జాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు.. మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు కరోనా పాజిటివ్‌ రావడంతో కొం దరు హైదరాబాద్‌, బెంగళూరు వెళ్లి చికిత్స పొందుతుండగా.. మరికొందరు  హోం ఐసోలేషనలో ఉంటున్నారు. పోలీసు, రెవెన్యూ అ ధికారులు కూడా ఇటీవల వివిధ ప్రాంతా ల్లో వైరస్‌ బారిన పడ్డారు. అనంతపురం నగ రం కరోనా కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది. ఇక్కడే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అనంతపురం నగరంలో 105 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆ తర్వా తి స్థానాల్లో పుట్టపర్తి 38, కదిరి 27, హిందూపురం, లేపాక్షి 15, ఆత్మకూ రు 11, గుంతకల్లు 10, గోరంట్ల, మడకశిర, శింగనమల 8, అనంతపురం రూరల్‌, ధర్మవరం, కళ్యాణదుర్గం, పెద్దపప్పూరు, తా డిపత్రి 5, బుక్కరాయసముద్రం 4, ముదిగుబ్బ, పెనుకొండ 3, చిలమత్తూరు, రాప్తాడు మండలంలో 2 కేసులు నిర్ధారణ అయ్యాయి. బత్తలపల్లి, బెలుగుప్ప, ధర్మవరం, గుత్తి, గుడిబండ, కనగానపల్లి, కొత్తచెరువు, నల్లమాడ, ఓడీసీ, పరిగి, పెద్దవడగూరు, పుటూ ్లరు, సోమందేప ల్లి, తాడిపత్రి, తలుపుల, ఉరవకొండ మండలాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 300 కేసులు నిర్ధారణ అవడంతో ఇప్పటి వర కు జిల్లావ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 159514కి చే రింది. ఇందులో 157346 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 1075 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-01-15T06:23:42+05:30 IST