ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

ABN , First Publish Date - 2020-09-30T01:22:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలావరకు తగ్గాయి.

ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలావరకు తగ్గాయి. మునుపటితో పోలిస్తే గత రెండు వారాలుగా తక్కువ సంఖ్యలోనే పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఉపశమనం కలిగించే విషయమేనని చెప్పుకోవచ్చు. ఇటీవలే మీడియా మీట్ నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. 


కేసుల సంఖ్య ఇదీ..

గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,190 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87, 351కు చేరుకుంది. ఇక మరణాల విషయానికొస్తే.. కొత్తగా 35 మంది కరోనాతో చనిపోయారని బులెటిన్‌లో ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన మరణాలతో కలిపితే ఇప్పటి వరకూ మొత్తం 5,780 మంది కరోనా మరణించారు. ప్రస్తుతం 59,435 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో 6 లక్షల 22 వేల 136 మంది డిశ్చార్జ్ అయ్యారు.


ఏయే జిల్లాలో ఎన్నెన్ని మరణాలు..

ప్రకాశంలో-08, చిత్తూరులో-06, అనంతపురంలో-04, తూర్పోగోదావరిలో-04, గుంటూరులో-04, విశాఖపట్నంలో-03, నెల్లూరులో-02, పశ్చిమ గోదావరిలో-02, శ్రీకాకుళంలో 02 మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటి వరకు 57 లక్షల 34 వేల 752 కరోనా టెస్ట్‌లు జరిగాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తూర్పు గోదావరిలో 991, పశ్చిమ గోదావరిలో 907, చిత్తూరు జిల్లాలో 784 కొత్త కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా గోదావరి జిల్లాల్లో మాత్రం తగ్గట్లేదు.


ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు..



Updated Date - 2020-09-30T01:22:35+05:30 IST