కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఆంక్షలు కఠినం.. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌..!

ABN , First Publish Date - 2020-07-25T20:34:09+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు లెక్కకు మిక్కిలిగా పెరుగుతూ ఆందోళనకర స్థాయికి చేరాయి. ఇప్పటికే జిల్లాలో అనేక కట్టడి చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఆంక్షలు కఠినం.. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌..!

మునిసిపాల్టీలు, మండల కేంద్రాలు, గుర్తించిన గ్రామాల్లో అమలు 

నేటి నుంచి నెలాఖరు వరకూ.. పరిమితులకు లోబడి జన సంచారం

కలెక్టర్‌ ముత్యాలరాజు ఉత్తర్వులు 


ఏలూరు (ఆంధ్రజ్యోతి):జిల్లాలో కరోనా కేసులు లెక్కకు మిక్కిలిగా పెరుగుతూ ఆందోళనకర స్థాయికి చేరాయి. ఇప్పటికే జిల్లాలో అనేక కట్టడి చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. ఏరోజుకారోజు వందల సంఖ్య లో నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులపై రాష్ట్ర ప్రభు త్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి వీలుగా కఠినంగా వ్యవ హరించాలని నిర్ణయిస్తూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఏలూరుసహా కొన్ని మునిసిపాల్టీల్లో ఉదయం 11 గంటల వరకూ కొన్ని సడలింపు ఇచ్చి, ఆ తదుపరి పరిమి తులతో కూడిన వాటికి మాత్రమే అనుమతులిచ్చారు. తాజాగా శనివారం నుంచి నెలాఖరు వరకూ వారం రోజులపాటు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, మండల కేంద్రాలు, గుర్తించిన గ్రామాల్లో ఈ తరహా పరిమితులు విధిస్తున్నట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.


పట్టణాలు, మండల కేంద్రాల్లో..

భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం సహా అన్ని ప్రాం తాల్లోనూ పరిమితులకు లోబడే ఇకపై వ్యవహరించాలి. ముం పు మండలాలైన కుక్కకూరు, వేలేరుపాడు సహా జిల్లాలోని 48 మండలాల్లోనూ పరిమితులు అమలులోకి వస్తాయి. పాజి టివ్‌ కేసుల సంఖ్య ఉధృతంగావున్న ఆరు మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ పరిమితులు విధించారు. లాక్‌డౌన్‌ తరహాలో నిబంధనలు అమలుచేస్తారు. భీమవరం రూరల్‌, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, పోడూరు, వీరవాసరం మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. 


ఎక్కడెక్కడ ఏ ఊర్లలో.. 

16 మండలాల్లోని గుర్తించిన గ్రామాల్లో కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఏలూరు మండలం కొమడవోలు, వెంకటాపురం, సత్రంపాడు, మాదేపల్లి, శనివారపుపేట, తంగెళ్ళమూడి, పెదపాడు మండలం పెదపాడు, ఏపూరు, వేంపాడు, కొక్కిరిపాడు, వట్లూరు, తాడేపల్లిగూడెం మండలం మాధవరం, తాడేపల్లి, ఆచంట మండలం ఆచంట, కొడమంచిలి, వేమవరం, వల్లూరు, కోడేరు, ఆకివీడులోని దుంపగడప, పెదకాపవరం, చెరుకుమిల్లి, అజ్జమూరు, యలమంచిలిలోని యలమంచిలి, కొంతేరు, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అడవిపాలెం, వైవి లంక, చించినాడ, కాళ్లలోని కాళ్ల, పెద అమిరం, సీసలి, బొండాడ, కోపల్లె, పాలకోడేరులోని పాల కోడేరు, విస్సాకోడేరు, గొల్లలకోడేరు, కుముదవల్లి, శృంగవృక్షం, మోగల్లు, ఉండిలోని ఉండి, ఎన్‌ఆర్‌పి అగ్రహారం, వాండ్రం, చెరుకువాడ, ఎండగండి, నిడదవోలులోని పందలపర్రు, సమిశ్ర గూడెం, పెనుగొండలోని పెనుగొండ, సిద్దాంతం, పెనుమంట్ర లోని పెనుమంట్ర, మార్టేరు, నెగ్గిపూడి, పెరవలిలోని పెరవలి, కండవల్లి, ఉండ్రాజవరంలోని ఉండ్రాజవరం, కాల్దారి, జంగారె డ్డిగూడెంలోని చక్రదేవరపల్లి, కొయ్యలగూడెం మండలంలోని కొయ్యలగూడెం, రాజవరం గ్రామాలన్నింటిలోనూ పరిమితులు విధించారు.

Updated Date - 2020-07-25T20:34:09+05:30 IST