భారత దేశంలో 22 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-10T21:33:52+05:30 IST

దేశంలో కరోనా విలయతాండం చేస్తోంది. రికార్డు స్థాయిలో..

భారత దేశంలో 22 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండం చేస్తోంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. గత కొంత కాలంగా రోజూ 900 వరకు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ బారిన పడి 1007మంది మరణించారు. ఒకే రోజు వెయ్యిమంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వారిలో ఇప్పటి వరకు 15,035 వేలమంది కోలుకోగా మరో 6,34,000 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-10T21:33:52+05:30 IST