కరోనా @ 1325... మొత్తం కేసులు 18801

ABN , First Publish Date - 2020-08-05T18:17:17+05:30 IST

అనంతపురం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 18801కి చేరింది. ఇందులో రికవరీ శాతం కూడా పెరుగుతుండడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.

కరోనా @ 1325... మొత్తం కేసులు 18801

రికవరీ 10944... ఆరుగురి మృతి

130కి పెరిగిన మరణాలు

అనంతపురం, ధర్మవరంలో అత్యధికం


అనంతపురం (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 18801కి చేరింది. ఇందులో రికవరీ శాతం కూడా పెరుగుతుండడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. కేసులు అమాంతం పెరగటం, మరణాలు అధికమవుతుండటం ఆందోళన కల్పిస్తోంది. రెండు రోజులుగా వెయ్యిలోపే జిల్లాలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం మళ్లీ అత్యధికంగా కేసులు వచ్చాయి. రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 24 గంటల్లోనే 1325 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఆరుగురు కరోనా బాధితులు చికిత్స పోందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 130కి చేరింది. ఇంకా 7727 మంది కరోనాతో పోరాడుతున్నారు.


అనంతపురం, ధర్మవరంలో అత్యధికం

అనంతపురం నగరం, ధర్మవరంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి, అనంతపురంలో 248, ధర్మవరంలో 238 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఉరవకొండ 69, గుత్తి 66, గుంతకల్లు 60, హిందూపురం 51, పుట్టపర్తి 34, పామిడి 33, తాడిపత్రి 32, పెనుకొండ 32, కదిరి 26, నార్పల 25, యాడికి 24, యల్లనూరు 23, బుక్కరాయసముద్రం 21, ఆత్మకూరు 21, పుట్తూరు 19, కనేకల్లు 18, గాండ్లపెంట 18, కనగానిపల్లి 15, ముదిగుబ్బ 15, రాయదుర్గం 14, కళ్యాణదుర్గం 14, చెన్నేకొత్తపల్లి 14, పరిగి 13, గోరంట్ల, పెద్దపప్పూరు, తనకల్లు 12, సోమందేపల్లి, కొత్తచెరువు, రొద్దం, తలుపుల, విడపనకల్లు 10, పెద్దవదుగూరు 9, బుక్కపట్నం, బెలుగుప్ప, రాప్తాడు 8, ఎన్‌పీకుంట, బత్తలపల్లి 7, లేపాక్షి, తాడిమర్రి 5, అమరాపురం, బ్రహ్మసముద్రం, ఓడిచెరువు, సింగనమల 4, నల్లమాడ, నల్లచెరువు, వజ్రకరూరు, గార్లదిన్నె, గుమ్మఘట్ట మండలాల్లో మూడేసి కేసులు, రామగిరి, శెట్టూరు, హిరేహాళ్‌, గుడిబండ, కూడేరు, రొళ్ళ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు. మొత్తం 56 మండలాల్లో కలిపి 1325 మంది కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో మరోసారి భారీ స్థాయిలో కరోనా నుంచి కోలుకున్నారు. మంగళవారం 1715 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.  


50 మందికే టోకెన్లు

జిల్లాలో అనుమానితులకు కరోనా పరీక్షల నమూనాలు సేకరిస్తున్నారు. సోమవారం జిల్లాలో అక్కడక్కడా వైద్య సిబ్బంది సకాలంలో రాకపోవటం, సర్వర్‌ సమస్యతో జనం కొంత ఇబ్బంది పడ్డారు. మంగళవారం కూడా 13 ప్రాంతాల్లో నమూనాలు సేకరించారు. వందలాది మంది తరలివచ్చి శాంపిళ్లు ఇచ్చారు. జిల్లా కేంద్రంలో మాత్రం ఒక్కో కేంద్రంలో 50 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి, శాంపిళ్లు తీసుకున్నారు. దీంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. అది కూడా సిఫార్సు ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


నేడు నమూనాల సేకరణ ప్రాంతాలివీ..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నమూనాలు సేకరించనున్నారు. కళ్యాణదుర్గం, హిందూపురం, ధర్మవరం రూరల్‌ పరిధిలోని (ఏలకుంట్ల, ఓబులనాయనపల్లి), ధర్మవరం, తాడిపత్రి, పెనుకొండ, గుంతకల్లు, గుత్తితోపాటు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎ్‌సబీఎన్‌, పాతూరు ఆసుపత్రి, ఆర్ట్స్‌ కళాశాల, రుద్రంపేట ప్రాంతాల్లో నమూనాలు సేకరించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-08-05T18:17:17+05:30 IST