చిత్తూరు జిల్లాలో.. 20 వేలకు చేరువైన కేసులు

ABN , First Publish Date - 2020-08-12T14:42:17+05:30 IST

జిల్లాలో సోమవారం రాత్రి 9 గంటల నుంచీ మంగళవారం రాత్రి 9 గంటల వరకూ..

చిత్తూరు జిల్లాలో.. 20 వేలకు చేరువైన కేసులు

కొత్తగా 818 మందికి సోకిన కరోనా

 

తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం రాత్రి 9 గంటల నుంచీ మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 818 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిలో 298 కేసులు కేవలం మంగళవారం ఉదయం 9 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకూ 12 గంటల్లో నమోదయ్యాయి. తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 90, చిత్తూరులో 62, చంద్రగిరిలో 44, తిరుపతి రూరల్‌ మండలంలో 23, మదనపల్లెలో 11, వరదయ్యపాలెంలో 10, రేణిగుంటలో 6, శ్రీకాళహస్తి, కేవీపల్లె, ఏర్పేడు మండలాల్లో 5 చొప్పున, పిచ్చాటూరులో 4, పీలేరు, సత్యవేడు, సోమల, పుత్తూరు మండలాల్లో 3 చొప్పున, వడమాలపేట, కలికిరి మండలాల్లో 2, సదుం,  చిన్నగొట్టిగల్లు, వడమాలపేటలో 2, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, పలమనేరు, పూతలపట్టు, రామచంద్రాపురం, రామకుప్పం, శాంతిపురం, వెదురుకుప్పం, యాదమరి, బి.కొత్తకోట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన కేసు ఒకటి వున్నాయి.


కాగా వీటితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాలో 19750కు చేరుకుని 20 వేలకు చేరువయ్యాయి. మంగళవారం తిరుపతిలో సకాలంలో వైద్యం అందక కొవిడ్‌ బాధితుడొకరు మృతి చెందారు. సోమల మండలంలో టీచరు ఒకరికి, కేవీపల్లె మండలం వగళ్ళలో సచివాలయ ఉద్యోగి ఒకరికి కరోనా సోకింది.


12మంది మృతి....127 మంది డిశ్చార్జి

కరోనా వ్యాధితో పోరాడుతూ 12మంది మృత్యువాత పడ్డారు. చికిత్స పొందుతూ కోలుకున్న 127 మందిని మంగళవారం వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 47 మంది, రుయా నుంచి 13,  శ్రీనివాసం సెంటర్‌ నుంచి 67 మంది చొప్పున ఉన్నారు. 



Updated Date - 2020-08-12T14:42:17+05:30 IST