చిత్తూరు జిల్లాలో మళ్లీ వెయ్యి దాటాయ్‌!.. తాజాగా ఎన్ని కేసులంటే..

ABN , First Publish Date - 2020-09-18T16:44:33+05:30 IST

జిల్లాలో గడిచిన 25 గంటల వ్యవధిలో విడుదలైన పరీక్షల ఫలితాలతో కొత్తగా..

చిత్తూరు జిల్లాలో మళ్లీ వెయ్యి దాటాయ్‌!.. తాజాగా ఎన్ని కేసులంటే..

తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 25 గంటల వ్యవధిలో విడుదలైన పరీక్షల ఫలితాలతో కొత్తగా 1045 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. బుధవారం సాయంత్రం నుంచీ గురువారం ఉదయం వరకూ 311 మందికి,అప్పటి నుంచీ రాత్రి 7 గంటల వరకూ మరో 734 మందికి పాజిటివ్‌ అని ఫలితాలు తేల్చాయి.తిరుపతి నగరంలో 171, చిత్తూరులో 87, శ్రీకాళహస్తిలో 56, తిరుపతి రూరల్‌ మండలంలో 43, పుత్తూరులో 36, మదనపల్లెలో 28, పలమనేరులో 22, రామచంద్రాపురంలో 21 కేసులు వీటిలో వున్నాయి.


తాజా కేసులతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 55444కు చేరుకుంది. గురువారం  12మంది కరోనాతో మృతి చెందడంతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 564కు చేరింది. అలాగే కరోనా నుంచి కోలుకున్న 265మందిని ఆస్పత్రులనుంచి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. 


Updated Date - 2020-09-18T16:44:33+05:30 IST