‘తూర్పు’న మళ్లీ కలకలం.. గడిచిన 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-09-18T17:03:49+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 24 గంటల్లో ట్రూ నాట్‌ ద్వారా..

‘తూర్పు’న మళ్లీ కలకలం.. గడిచిన 24 గంటల్లో..

24 గంటలు.. 1,383 కేసులు 

మొత్తం బాధితులు 82,447 మంది

ఒక్క రోజునే ఐదుగురి మృతి


కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 24 గంటల్లో ట్రూ నాట్‌ ద్వారా చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 538, రాపిడ్‌ కిట్‌ల ద్వారా 845 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణయ్యింది. దీంతో మొత్తం 1,383 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 82,447 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క రోజులో ఐదుగురు మృతి చెందారు. దీంతో కరోనా సోకి చికిత్స పొందుతూ ఇప్పటివరకు 472 మంది మరణిం చారు. మొన్నటి వరకు పట్టణాల్లో ఎక్కువగా కనిపించిన రుగ్మత కొన్నాళ్ల నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామాల్లో కూడా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రతీ రోజూ గ్రామాల్లో, పట్టణాల్లో పోటాపోటీగా కేసులు నమోదవుతున్నాయి.


Updated Date - 2020-09-18T17:03:49+05:30 IST