గుంటూరు జిల్లాలో కొత్తగా 378మందికి కరోనా..

ABN , First Publish Date - 2020-10-25T12:22:52+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ పాజిటివ్‌ రేట్‌ మా త్రం జిల్లాలో తగ్గింది. శనివారం వివిధ ల్యాబ్‌ల నుంచి..

గుంటూరు జిల్లాలో కొత్తగా 378మందికి కరోనా..

4.10 శాతానికి తగ్గిన పాజిటివ్‌ రేట్‌


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ పాజిటివ్‌ రేట్‌ మా త్రం జిల్లాలో తగ్గింది. శనివారం వివిధ ల్యాబ్‌ల నుంచి 9,217 శాంపిల్స్‌ ఫలితాలు రాగా వాటిల్లో 378 (4.10 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. 8,839(95.90 శాతం) మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇదే విధంగా శుక్రవారం కూడా 11,466 శాంపిల్స్‌ ఫలితాలు రాగా 523(4.56 శాతం) మందికి పాజి టివ్‌ వచ్చింది. 10,943(95.44 శాతం) మందికి నెగిటివ్‌గా తేలింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పాజిటివ్‌ శాతం 15 వరకు ఉండగా ప్రస్తుతం నాలుగు శాతానికి తగ్గిపోవడం కొంతమేర ఊరట కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 66,369 (9.90శాతం)మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 62,135 (93.62శాతం) మంది డిశ్చార్జ్‌ కాగా ప్రస్తుతం 3,565 (5.37 శాతం) మంది కరోనాకు చికిత్స తీసుకొంటోన్నారు.


శనివారం మరో నలుగురు చనిపోవడంతో మృతుల సంఖ్య 669 (1.01 శాతం)కు చేరింది. శనివారం రికార్డు స్థాయిలో 13,150మంది శాంపిల్స్‌ని టెస్టింగ్‌ నిమిత్తం సేకరించారు. కొత్తగా గుం టూరు నగరంలో 76, తెనాలి-66, మంగళగిరి-22, దాచేపల్లి -17, నరసరావుపేట-16, వట్టిచెరుకూరు-15, తాడేపల్లి-13, చిల కలూరిపేట-10, అమృతలూరు-10 పాజిటివ్‌ కేసులు వచ్చా యి. ఇవికాక మరో 133పాజిటివ్‌ కేసులు వేర్వేరు మండలాల్లో వచ్చినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-25T12:22:52+05:30 IST