Abn logo
Jul 7 2020 @ 14:36PM

కరీంనగర్‌పై కరోనా పంజా.. భయం గుప్పిట్లో ప్రజలు

జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 17 కేసులు 

కరీంనగర్‌లో వారంలో 34 మందికి..

నగరం నలుమూలలా వ్యాప్తి 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): జిల్లాపై కరోనా పంజా విసురుతున్నది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించక పోవడం లాంటి కనీస నిబంధనలనూ పట్టించుకోక పోవడంతో వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్నది. కరీంనగర్‌లో వారం రోజుల్లో 34 మందికి కరోనా కరోనా సోకడం కల వరం కలిగిస్తున్నది. ప్రారంభంలో కశ్మీర్‌గడ్డ, ముకరంపుర ప్రాంతాలకే పరిమితమైన వైరస్‌ క్రమేపీ నగరం నలుమూలలూ విస్తరిస్తున్నది. ఈనెల 4న నగరంలో ఒకే రోజు 10 మంది వ్యాధిబారిన పడగా 5న ఇద్దరు, సోమవారం ఎనిమిది మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.  ఈనెల ఒకటో తేదీన ఐదుగురికి, రెండో తేదీన ఇద్దరికి, మూడున మరో ఇద్దరికి వ్యాధి సోకింది. వరుసగా ప్రతిరోజూ ప్రజలు వ్యాధిబారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం కరీంనగర్‌లో ఎనిమిది మందికి, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో ముగ్గురికి, జమ్మికుంటలో ముగ్గురికి, హుజూరాబాద్‌లో ఒకరికి, మానకొండూర్‌లో ఒకరికి, తిమ్మాపూర్‌లో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.


నిబంధనలు పట్టించుకోకుండా..

మరోవైపు పలువురు పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నా రనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అధికారిక సమావేశాలపై ఆయా వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతున్నది. వ్యాధి వ్యాప్తికి ఇవి కూడా కారణమవుతున్నాయనే అభిప్రాయాన్ని వారు వ్య క్తం చేస్తున్నారు. కరోనా తీవ్రత ముగిసే వరకు ఇలాంటి కార్య క్రమా లను లేకుండా చూస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కరో నా వ్యాధి అక్కడ, ఇక్కడ వచ్చిందంటూ పుకార్లు జోరుగా సాగు తుండడంతో భయంభయంతో కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడం,  హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి రోజూ రాకపోకలు సాగుతుండడంతో వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 


కట్టడి గాలికి.. 

మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించిన రోజున ఒక్క కేసు కూడా లేక పోయినా లాక్‌డౌన్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేసి వ్యాధి రోజు రోజుకు తీవ్రమవుతున్న తరుణంలో గాలికి వదిలివేశా యని ప్రజలు వాపోతున్నారు. కరోనా భయంతో ప్రజలు స్వీయ నియంత్రణ వైపు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కిరాణా మర్చంట్స్‌, స్వర్ణకారుల సంఘం, అప్టికల్‌ షాపులతో పాటు కొన్ని దుకాణాలను సా యంత్రం 6 గంటల వరకే స్వచ్చందంగా మూసి వేసుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలను కట్టడి చేయకుండా వారిని హోం క్వారంటైన్‌కు పరిమితం చేస్తుండడం కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. 


విచ్చల విడిగా సంచరిస్తున్న హోం క్వారంటైన్‌ వ్యక్తులు

కరోనా బారిన పడ్డ కొంత మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నారని, వారి కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌ నిబంధనలను పాటించడం లేదు. వారు విని యోగించిన మాస్క్‌లు, గ్లౌజులు, ఇతరత్రా బయో వేస్టేజీని బయట పడవేస్తున్నారు. దీంతో వ్యాధి మరింత ప్రబలే అవకాశాలున్నాయని ఆ పరిసరాల ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేయాలని, క్షేత్రస్థాయిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా చేసి వ్యాధి ప్రబలకుండా మరిన్ని జాగ్రత్త చర్యలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement