కరోనా బారిన 241మంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి

ABN , First Publish Date - 2020-08-13T21:07:53+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఇరుజిల్లాల్లో 241మంది కరోనా బారిన పడ్డారు. ఇరుజిల్లాల్లోని వైద్యఆరోగ్యశాఖ ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో 194 మందికి.. ఉమ్మడిజిల్లాలోని

కరోనా బారిన 241మంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి

ఖమ్మం జిల్లాలో 125, భద్రాద్రిలో 70మందికి పాజిటివ్‌

సింగరేణి ఐదు ఏరియాల్లో 46కేసులు 


(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఇరుజిల్లాల్లో 241మంది కరోనా బారిన పడ్డారు. ఇరుజిల్లాల్లోని వైద్యఆరోగ్యశాఖ ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో 194 మందికి.. ఉమ్మడిజిల్లాలోని సింగరేణి ఐదు ఏరియాల్లోని ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో 46మందికి.. మొత్తం 241మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఇక భద్రాద్రి జిల్లాలో ఓ సింగరేణి అధికారి కరోనా లక్షణాలతో మృతిచెందారు. ఖమ్మం జిల్లాలో 390 మందికి పరీక్షలు చేయగా.. 125మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక  గతంలో కొవిడ్‌ బారిన పడిన వారిలో 38మంది కోలుకున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 70మందికి కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. ఖమ్మం జిల్లా  వైరాలో ఏడుగురికి, కొణిజర్ల మండలంలో నలుగురికి, సత్తుపల్లిలో 11మందికి, కూసుమంచి మండలంలో ఏడుగురికి,  మధిర మండలంలో ఎనిమిది మందికి, చింతకానిలో ముగ్గురికి, ఎర్రుపాలెంలో ఒకరికి, బోనకల్‌లో ఒకరికి, కల్లూరు మండలంలో ఆరుగురికి పాజిటివ్‌, తిరుమలాయపాలెంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరితో పాటు ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 62మంది కొవిడ్‌ బారిన పడినట్టు అధికారులు లెక్కల్లో వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం 70 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 10మందికి, పాల్వంచ ఏరియా ఆసుపత్రిలో ఎనిమిది మందికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 21 మందికి, లక్ష్మీదేవిపల్లిలో ఇద్దరికి, చర్లలో ఒకరికి, అశ్వారావుపేటలో నలుగురికి, బూర్గంపాడులో ఇద్దరికి, టేకులపల్లిలో ఒకరికి, కరకగూడెంలో తొమ్మిది మందికి, ఇల్లెందులో ఐదుగురికి, అశ్వాపురంలో ముగ్గురికి, దమ్మపేట నలుగురికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి.


సింగరేణి ఆసుపత్రుల్లో 46 పాజిటివ్‌లు

ఉమ్మడిజిల్లాలోని సింగరేణి ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో 46పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మణుగూరు ఏరియాలో 20, ఇల్లెందులో 7, సత్తుపల్లి 6, కొత్తగూడెంలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ బుధవారం రుద్రంపూర్‌ 5షాఫ్ట్‌ గనిలో పనిచేస్తున్న ఒక సీనియర్‌ మేనేజర్‌ (55) మృతి చెందారు. సింగరేణికి చెందిన ఇద్దరు ప్రధాన అధికారులు కరోనా బారిన పడి హైదరాబాద్‌లో వైద్య సేవలు పొందుతున్నారు. 

Updated Date - 2020-08-13T21:07:53+05:30 IST