విజృంభిస్తున్న కరోనా.. ఉమ్మడి నల్గొండలో మరో 101 కేసులు

ABN , First Publish Date - 2020-08-13T17:46:00+05:30 IST

ఉమ్మడి జిల్లాలో బుధవారం 101 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో54, సూర్యాపేట జిల్లాలో36, యాదాద్రిభువనగిరి జిల్లాలో 11కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా

విజృంభిస్తున్న కరోనా.. ఉమ్మడి నల్గొండలో మరో 101 కేసులు

ఉమ్మడి జిల్లాలో 101 పాజిటివ్‌ కేసులు నమోదు


నల్లగొండ(ఆంధ్రజ్యోతి):  ఉమ్మడి జిల్లాలో బుధవారం 101 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో54, సూర్యాపేట జిల్లాలో36, యాదాద్రిభువనగిరి జిల్లాలో 11కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తంగా 1434 పాజిటివ్‌ కేసులు నమోదవగా 21మంది మృతిచెందారు. 2517మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా 203మంది డిశార్జి అయ్యారు. 


జిల్లాలో నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో చండూరు మండలంలో ముగ్గురు, ఆలేరులో ముగ్గురు, అనంతగిరిలో ఆరుగురు, వలిగొండలో ఇద్దరు, నకిరేకల్‌లో ఇద్దరు, పెద్దవూరలో ముగ్గురు, రామన్నపేటలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. సాగర్‌ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ప్రతిరోజు నిర్వహిస్తున్న కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు కిట్లు లేక బుధవారం నిలిచిపోయాయి. 


అడ్డగూడూరు మండలంలోని చిన్నపడిశాలలో ఒకటి,  పీఏపల్లి మండలం గుడిపల్లి మధిర గ్రామమైన నడింబాయిగూడెంలో ఒకటి పాజిటివ్‌ కేసు నమోదైంది.


తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి ప్రశాంత్‌ తెలిపారు. 


తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలో7, తొండ గ్రామంలో 3 మొత్తం 10పాజిటివ్‌ కేసులు  నమోదైనట్లు డాక్టర్‌ ప్రశాంత్‌బాబు తెలిపారు. 


ఆత్మకూరు(ఎం)  మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన 60ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. హైదరాబాద్‌లోని శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. 


చౌటుప్పల్‌ మండలంలో ఇద్దరికి, చింతపల్లి మండలంలో 8మందికి, కొండమల్లేపల్లి మండలంలో ఒకరికి, డిండి మండలంలో ఒకరికి, గుర్రంపోడు మండలంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


మర్రిగూడ మండలంలోని ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి, సరంపేట గ్రామంలోని ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ దీపక్‌ తెలిపారు. 


దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో 58మందికి పరీక్షలు చేయగా  10మందికి పాజిటివ్‌ వచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములునాయక్‌ తెలిపారు. 


కట్టంగూరు పీహెచ్‌సీలో 21మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


ఉమ్మడి మేళ్లచెర్వు మండలంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి ప్రేమ్‌సింగ్‌  తెలిపారు. 


నిడమనూరు మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు  మండల వైద్యాధికారి మాధవ్‌కుమార్‌ తెలిపారు. 


శాలిగౌరారం మండలంలో ఇద్దరికి, బొమ్మలరామారం మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


యాదగిరిగుట్ట పట్టణంలో ముగ్గురికి, మండలంలోని పెద్దకందుకూర్‌ గ్రామంలో యువతికి, మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వంశీకృష్ణ తెలిపారు. 


ఈ నెల 17నుంచి మూడు రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించనున్నట్లు  సాగర్‌ మర్చంట్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మంచికంటి కిశోర్‌బాబు తెలిపారు. 

Updated Date - 2020-08-13T17:46:00+05:30 IST