నెల్లూరు జిల్లాలో.. కరోనా వ్యాప్తి తగ్గినట్టేనా!?

ABN , First Publish Date - 2020-09-24T17:31:17+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గిందా!? అంటే నిజమేనంటున్నాయి గణాంకాలు. నెలరోజుల్లో..

నెల్లూరు జిల్లాలో.. కరోనా వ్యాప్తి తగ్గినట్టేనా!?

పెరుగుతున్న  రికవరీ!

నెల రోజుల్లో 31,103 మందికి నెగిటివ్‌


నెల్లూరు: కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గిందా!? అంటే నిజమేనంటున్నాయి గణాంకాలు. నెలరోజుల్లో 31,103 మందికి నెగిటివ్‌ రిపోర్టులు అందడమే ఇందుకు ఉదాహరణ. జిల్లాలో 11 ఆసుపత్రులలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తుండగా కోలుకునే వారి సంఖ్య పెరగడంతోపాటు మరణాలు రేటు కూడా తగ్గుతోంది. 70 ఏళ్లకు పైబడిన వారు సైతం కోలుకుంటున్నారు. మెరుగైన చికిత్స అందుబాటులోకి రావడంతో 14 రోజులకు బదులు 7 రోజులకే నెగిటివ్‌ రిపోర్టు వస్తోంది. అయితే, కరోనా చికిత్సపై మరింత దృష్టి పెడితే కోలుకునే సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గతంలో ఆసుపత్రిలో 14 రోజులు చికిత్స పొందిన అనంతరం నెగిటివ్‌ వస్తే డిశ్చార్జి అయినా 14 రోజులు హోం క్వా రంటైన్‌లో ఉండాలి. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో 7 రోజులకు కుదించగా కరోనా పరీక్షలో నెగిటివ్‌ వస్తే ఇంటికి పంపుతున్నారు. దీనిని బట్టి కరోనా తీవ్రత తగ్గుతుందనే సంకేతం వస్తోంది. 


నెల రోజుల్లో 31,103 మంది రకవరీ 

జిల్లాలో 49 వేల మందికి పైబడి కరోనా పాజిటివ్‌కు గురికాగా నెల రోజుల్లో 31,103 మంది కరోనా నుంచి కోలుకున్నా రు. దీంతో కరోనాపై భయాందోళనలు విడనాడాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే హోం క్వారంటైన్‌లో చికిత్స పొందేవారు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నెలాఖరులో కరోనా తీవ్రత మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.


479 పాజిటివ్‌ల నమోదు

జిల్లాలో బుధవారం 479 పాజిటివ్‌ కేసులు నమోద య్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,729కు చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకోలేక కోవూరుపల్లి, చేజర్ల, కోవూరులలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. మహమ్మారి నుంచి కోలుకుని 647 మంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2020-09-24T17:31:17+05:30 IST