ఓ యువకుడికి కరోనా.. అంతకుముందే మిత్రులకు విందు.. వారి గురించి ఆరాతీస్తే..

ABN , First Publish Date - 2020-07-29T20:32:14+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బోధన్‌లో మంగ ళవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూ శాయి.

ఓ యువకుడికి కరోనా.. అంతకుముందే మిత్రులకు విందు.. వారి గురించి ఆరాతీస్తే..

పెరుగుతున్న కరోనా కేసులు


నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బోధన్‌లో మంగ ళవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూ శాయి. బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మందికి కరో నా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ ఫలి తాలు, 20 మందికి నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయని ఏరి యా ఆసుపత్రి సూపరిండెంట్‌ అన్నపూర్ణ తెలిపారు. 


నవీపేటలో నలుగురికి

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవా రం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఇన్‌చార్జీ మెడికల్‌ ఆఫీసర్‌ అజ య్‌కుమార్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి లో నవీపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌, నాళేశ్వర్‌ గ్రామానికి చెంది రెంజల్‌ పోలీస్‌స్టేషన్‌లో ప నిచేస్తున్న హోంగార్డు, నవీపేట ధర్యాపూర్‌కు చెందిన యువకుడితోపాటు, హైదరాబాద్‌ నుంచి వచ్చి సోమవారం కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్యకు సైతం పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 14 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఇందులో నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 


ఎడపల్లి మండలంలో ఇద్దరికి

ఎడపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం  కొవి డ్‌ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింద ని మెడికల్‌ ఆఫీసర్‌ జవేరియాసుల్తానా తెలిపారు. న లుగురికి పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. బాధితులు నిజా మాబాద్‌ నగరానికి చెందిన ఇద్దరు మహిళలు అని ఆ మె వివరించారు. 


కోటగిరిలో ఇద్దరికి

కోటగిరి మండలంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసు లు నిర్ధారణ అయ్యాయి. కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రి లో నాలుగు ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా ఒకరికి క రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బోధన్‌ మండ లం ఆచన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి కోటగిరి మండలం లో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నాడు. అతనికి ర్యాపిడ్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోట గిరి మండల కేంద్రంలో చావిడి గల్లికి చెందిన ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గత నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న ఆ వ్యక్తి జిల్లా కేంద్రంలో టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మండలంలో కరోనా పాజి టివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. 


వన్నెల్‌(బి)లో కరోనాతో వృద్ధురాలి మృతి 

బాల్కొండ మండలంలోని వన్నెల్‌(బి) గ్రామానికి చెందిన వృద్ధురాలు(70) మంగళవారం కరోనాతో మృ తిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నాలుగు రోజు ల క్రితం బీపీ తక్కువ కావడంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లగా అక్కడ చేసిన కరోనా పరీక్షల్లో ఆమె కు కొవిడ్‌-19 సోకినట్టు తేలింది. దీంతో ఆమెకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స ని ర్వహిస్తుండగా మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నా రు.  


గ్రామంలో పది రోజులు లాక్‌డౌన్‌

కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేపథ్యంలో వన్నె ల్‌(బి) గ్రామాభివృద్ధి కమిటీ పది రోజులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని తీర్మానించింది. గ్రామానికి చెం దిన వృద్ధురాలు మరణించడంతో వ్యాధి వ్యాప్తి నియం త్రణకు చర్యలు చేపడుతున్నారు. పది రోజుల పాటు మెడికల్‌ షాప్‌లు మినహా అన్ని దుకాణాలు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాలలో మాస్కు లేకుండా ఇద్దరి కంటే ఎక్కువ కనిపిస్తే జరి మానా విధిస్తామని మైక్‌లో అనౌన్స్‌ చేశారు. 


సిరికొండలో ఇద్దరికి కరోనా

సిరికొండ మండల కేంద్రంలో ఒకరికి(65), రావుట్ల లో మరొకరికి కరోనా నిర్ధారణ అయినట్లు వైధ్యాధికారి తెలిపారు. సిరికొండకు చెందిన వ్యక్తికి మూడు రోజుల క్రితం జ్వరం, జలుబు రాగా పరీక్షలు చేసుకున్నారు. సోమవారం రాత్రి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రి పోర్టు రావంతో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు వైధ్యాధికారి చెప్పారు. రావుట్లకు చెందిన ఒక యువకుడు ఇటీవల హైదరాబాద్‌లో పరీక్షలు చేసుకోగా మొదట నెగెటివ్‌ వచ్చిందని ల్యాబ్‌ వారు ఇచ్చారని, ఆ తర్వాత పాజిట్‌ అని అధికారులకు పంపించరాని సదరు యువకుడు వైద్యాధికారి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారని రావుట్ల గ్రామస్థులు చెప్పారు. వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌ మంగళవారం గ్రామానికి వెళ్లి పాజిటివ్‌ వచ్చిన యువకుడిని, ఆయన కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉండాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి వచ్చారు. కాగా, సిరికొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్‌ రాజరెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశమై గ్రామంలో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ చేయాలని తీర్మానించారు. బు ధవారం నుంచి సిరికొండలో లాక్‌డౌన్‌ చేస్తున్నందున ప్రజలు సహాకరించాలని సర్పంచ్‌, వార్డు సభ్యులు ప్ర జలకు విఙ్ఞప్తి చేశారు.


సుద్దులంలో పది మంది అనూమానితులు 

డిచ్‌పల్లి మండంలోని సుద్దులం గ్రామంలో పది రోజుల క్రితం కామారెడ్డిలోని ఓ వాహన షోరూంలో పనిచేసే యువకుడుకి కరోనా లక్షణాలు కనిపించడం తో హోంక్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే, ఆ యువకుడు ఇటీవలే గ్రామ యువకులకు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో పాల్గొన్న పది మంది యువకులలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్య అధికారులు విందు విషయాన్ని తెలుసుకొని ఇందులో పాల్గొన్న అందరినీ రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌ లో ఉండాలని సూచించారు. దీంతో గ్రామంలో కరోనా బాధితులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామ వీడీసీ కమిటీ, ప్రజాప్రతినిధులు గ్రామంలో లాక్‌డౌన్‌ చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు సాయంత్రం 5 గంటల నుం చి 6 గంటల వరకు వ్యాపార సంస్థలు, హోటళ్లు తెరు చుకోవాలని ఆదేశించారు. 

Updated Date - 2020-07-29T20:32:14+05:30 IST