ముంబై నుంచి సొంతూరికొచ్చిన తల్లీకొడుకులు.. వారం తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో..

ABN , First Publish Date - 2020-08-13T18:14:06+05:30 IST

జిల్లా బుధవారం కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు 67 నమోదయ్యాయి. ఇందులో ఆ ర్మూర్‌ డివిజన్‌లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్టులలో 27మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.

ముంబై నుంచి సొంతూరికొచ్చిన తల్లీకొడుకులు.. వారం తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో..

67 కొవిడ్‌-19 కేసుల నమోదు


ఆర్మూర్‌(నిజామాబాద్): జిల్లా బుధవారం కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు 67 నమోదయ్యాయి. ఇందులో ఆ ర్మూర్‌ డివిజన్‌లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్టులలో 27మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఆలూర్‌లో నలుగురికి, అంకాపూర్‌లో ఒకరికి, బ్రాహ్మణ్‌పల్లిలో ఇ ద్దరికి, మెంట్రాజ్‌పల్లిలో ఇద్దరికి, చేంగల్‌లో ఇద్దరికి, ప ల్లికొండలో ఒకరికి, వేల్పూర్‌లో ఇద్దరికి, పడిగెలలో ఇద్దరికి, నందిపేటలో ఒకరికి, వెల్మల్‌లో ఒకరికి, పెర్కి ట్‌లో ఒకరికి, ఆర్మూర్‌లో ఎనిమిది మందికి కరోనా పా జిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వ హించిన పరీక్షలలో ఆర్మూర్‌లో ఒకరికి, సోన్‌పేట్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు.


వర్నిలో నాలుగు 

వర్ని మండలంలో బుధవారం నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్‌ వెంకన్న తెలిపారు. వకీల్‌ఫారం గ్రామానికి చెందిన 25యేళ్ల యువకుడికి, చందూరుకు చెందిన 12 ఏళ్ల బాలికకు, 50ఏళ్ల మహిళకు, రుద్రూరు మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి వెల్లడించారు. 


నవీపేట మండలంలో ముగ్గురికి

నవీపేట మండలంలోని నవీపేటతోపాటు ఫకీరా బాద్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని నవీపేట సీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ దేవేందర్‌ తెలిపారు. వీరు ఇటీవల అనారోగ్యానికి గురికాగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వీరికి పాజిటివ్‌ వచ్చినట్లు రిపోర్టు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఫకీరాబాద్‌కు చెందిన వ్యక్తి రెంజల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ఓ గ్రామంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.  


రుద్రూరులో మూడు 

రుద్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రంలో బుధ వారం 20 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా అందులో మూడు పాజిటి వ్‌, 17 నెగిటివ్‌ వచ్చాయని వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు స్థానికే తరులని తెలిపారు. 


బోధన్‌లో ఆరు

బోధన్‌లో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ తెలిపారు. బుధవారం 36 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌, 30 మం దికి నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ఆమె సూచించారు. 


ఏరాజ్‌పల్లిలో వ్యక్తికి

బోధన్‌రూరల్‌ మండలంలోని ఏరాజ్‌పల్లి గ్రామా నికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు బుధవారం సాలూరా పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ తెలిపారు. 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని, 9 మందికి నెగిటివ్‌ వచ్చిందని ఆమె వివరించారు. 


నందిపేట మండలంలో ఇద్దరికి 

నందిపేట మండలంలో ఇద్దరికి కరోనా సోకినట్టు మండల వైద్యాధికారి విజయభాస్కర్‌ తెలిపారు. నం దిపేట పీహెచ్‌సీలో బుధవారం ఎనిమిది మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. ఒకరు నందిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారని, మరొకరు వెల్మల్‌ గ్రామంలో మాలబందకు చెందిన వృద్ధుడిగా గుర్తించారు.


బాల్కొండలో తల్లి, కొడుకుకు 

బాల్కొండ పీహెచ్‌సీలో శుక్రవారం నిర్వహించిన పరీక్షలో భీమ్‌గల్‌ మండలం జగిర్యాల్‌ గ్రామానికి చెందిన తల్లి, కొడుకుకు కరోనా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. వీరు ముంబై నుంచి వారం రోజుల క్రితం భీమ్‌గల్‌ మండలం చేంగల్‌కు వచ్చారు. బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఓపీ పరీక్షల కోసం రాగా కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించారు. కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్యులు పేర్కొన్నారు.


బ్రాహ్మణ్‌పల్లిలో భార్యాభర్తలకు 

జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గ్రామం లో భార్య, భర్తలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మం డల వైద్యాధికారి రఘువీర్‌గౌడ్‌ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భార్య, భర్తలకు కరోనా పరీక్షలు చేయగా వీరిద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలి పారు. మండలంలో ఇప్పటి వరకు 20కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు తెలిపారు. 


వేల్పూర్‌ మండలంలో నాలుగు 

వేల్పూర్‌ మండలంలో బుధవారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యులు అశోక్‌, వెంకటరమణ తెలిపారు. పడిగెలలో ఇద్దరికి, వేల్పూర్‌లో ఇద్దరికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2020-08-13T18:14:06+05:30 IST