విజృంభిస్తున్న కొవిడ్‌-19.. నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-08-14T17:24:47+05:30 IST

రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. జిల్లా వాప్తంగా గురువారం68 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. ఒక వైపు భయాందోళకు గురవుతున్నా.. అవసరం ఉన్నా లేకున్నా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారు.

విజృంభిస్తున్న కొవిడ్‌-19.. నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కేసులు

భయాందోళనలో ప్రజలు

నిబంధనలు పాటించని జనం


ఆర్మూర్‌(నిజామాబాద్): రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. జిల్లా వాప్తంగా గురువారం68 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. ఒక వైపు భయాందోళకు గురవుతున్నా.. అవసరం ఉన్నా లేకున్నా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారు.  దీంతో వ్యాధి తీవ్రత అధికమవుతోందని వైద్యులు పే ర్కొంటు న్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లో నిర్వ హించిన పరీక్షలలో 23మందికి కరో నా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 72మందికి ర్యాపిడ్‌ టెస్టు లు నిర్వహించగా 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నిజామాబాద్‌లో నిర్వహించిన పరీక్షలలో ముగ్గురికి వచ్చింది. ర్యాపిడ్‌ టెస్టులలో పోచంపాడ్‌లో ఒకరికి, చాకిర్యాల్‌లో ఒకరికి, లక్కోరలో ఇద్దరికి, అంక్సాపూర్‌లో ఒకరికి, ముప్కాల్‌లో ఒకరికి, మోర్తాడ్‌లో ఐదుగురికి, చేపూర్‌లో ఒకరికి, ఆర్మూర్‌లో ఎనిమిది మందికి, నిజామాబాద్‌లో ని ర్వహించిన పరీక్షల్లో ఆర్మూర్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆర్మూర్‌ పట్టణంలో పెర్కిట్‌లో ఒకరికి, శ్రీరామకాలనీలో ఇద్దరికి, మామిడిపల్లిలో ఒకరికి, గోల్‌బంగ్లా ప్రాంతంలో ఒకరికి, హౌసింగ్‌ బోర్డులో ఒకరికి, ఇతర ప్రాంతాల్లో ఐదుగురికి మొత్తం పట్టణంలోనే 11మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


మోర్తాడ్‌లో బ్యాంక్‌ సిబ్బందికి 

మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ క మ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో గురువారం కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించామని డాక్టర్‌ సుమంత్‌ తెలిపారు. 24మందికి కొవిడ్‌-19 ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని ఆయన తెలి పారు. మోర్తాడ్‌లో ఐదుగురు, ఎస్‌ బీఐ సిబ్బంది ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్‌ సుమంత్‌ తెలిపారు.


మెండోర మండలంలో రెండు 

మెండోర మండలంలో గురువారం రెండు కరో నా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు మెండోరా పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ నయనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పీహెచ్‌సీలో నలుగు రికి టెస్టులు చేయగా చాకిర్యాల్‌ వ్యక్తికి, మెండోరకు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మం డలంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతు న్నందున ప్రజలు మాస్కులు ధరించాలని సూ చించారు.

 

ధర్పల్లిలో మహిళకు 

ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న మహిళ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. జిల్లా  కేంద్రంలో గల ప్రైవేట్‌  ఆసుపత్రిలో పాజిటివ్‌ సోకిన మహిళ చికిత్స పొందుతున్నారు. మహిళ కుటుంబం నివాసముంటున్న పరిసర ప్రాంతాలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శానిటైజ్‌ చేశారు. 


వేల్పూర్‌ మండలంలో మూడు 

వేల్పూర్‌ మండలంలో రోజురోజుకు కరోనా పా జిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే గురువారం వేల్పూర్‌ మండలంలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యులు అశోక్‌, వెంకటరమణ తెలిపారు. లక్కోరలో ఇద్దరికి, అంక్సాపూర్‌ ఒకరికి కరోనా పరీక్షలు చేయగా వా రందరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు తెలి పారు. 


బోధన్‌లో మూడు 

బోధన్‌లో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఆసుప త్రిలో 20 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 


రెంజల్‌లో ముగ్గురికి 

రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన భార్యా భర్తలతో పాటు ఓ తొమిదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు క్రిస్టీనా తెలిపారు. చికిత్స పొందుతున్నారని తెలిపారు.


నవీపేటలో ఇద్దరికి 

నవీపేట సీహెచ్‌సీలో గురువారం ఏ డుగురికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా ఇద్దరికి క రోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఇన్‌చార్జి మెడికల్‌ ఆఫీసర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఇందులో మం డల కేంద్రంలోని ధర్యాపూర్‌కు చెందిన ఒక వ్యక్తి కాగా, మరొకరు నవీపేట సీహెచ్‌సీలో పనిచేసే ఉద్యోగి ఉన్నారని పేర్కొన్నారు. నవీపేట సీహెచ్‌సీలో గురువారం సాయంత్రం రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. 


ఎడపల్లి మండలంలో ఇద్దరికి 

ఎడపల్లి పీహెచ్‌సీలో గురువారం 11 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఒకరు ఎడపల్లి వాసి కాగా, మరొకరు మండలంలోని జంలంకు చెందిన వారని వారు పేర్కొన్నారు. బాధితులను హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-14T17:24:47+05:30 IST