కరోనా కల్లోలం.. పెద్దపల్లి జిల్లాలో మరో 66 మందికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-12T20:18:29+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం మరో 66 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,171కి చేరింది. గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక జర్నలిస్టు కరోనా

కరోనా కల్లోలం.. పెద్దపల్లి జిల్లాలో మరో 66 మందికి పాజిటివ్

1,171 మందికి చేరిన కేసుల సంఖ్య

కరోనాతో ఇద్దరు మృతి


పెద్దపల్లి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.  సోమవారం మరో 66 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,171కి చేరింది. గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక జర్నలిస్టు కరోనా బారిన పడి కరీంనగర్‌ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఒక డాక్టర్‌ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరగా అతడికి కరోనా వచ్చినట్లు నిర్ధారించి చికిత్స అందించారు. వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరల అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఒక దస్తావేజుల లేఖరికి ఐదు రోజులుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు యథా విధిగా చేస్తున్నారు. మంథని, యైుటింక్లయిన్‌ కాలనీ, పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, సుల్తానాబాద్‌లో పలువురికి కరోనా సోకింది. సుల్తానాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలువురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. 


సుల్తానాబాద్‌ సర్కిల్‌లో ఏడుగురు పోలీసులకు..

సుల్తానాబాద్‌: కరోన వైరస్‌ పోలీసుల్లో కలకలం రేపుతోంది. సుల్తానాబాద్‌ సర్కిల్‌ పరిధిలో మంగళవారం ఏడుగురు పోలీసులకు కరోనా సోకింది. సుల్తానాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐదుగురు సిబ్బందికి కరోన పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు ఏఎస్‌ఐలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు, ఒక డ్రైవర్‌కు పాజి టివ్‌గా తేలింది. వీరందరనీ హోంక్వారంటైన్‌లో ఉంచారు. అలాగే కాల్వశ్రీరాం పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌కు, పొత్కపల్లి స్టేషన్‌లో ఒక హోం గార్డు కు కరోన పాజిటివ్‌గా తేలింది.


మంథని మండలంలో 13 మందికి..

మంథని పట్టణంలో మరో 13 మంది కరోనా బారిన పడ్డారు. స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. స్థానిక నడివీధిలోని ఒకే కుటుంబంలోని ముగ్గురి కి, ఓ వృద్ధురాలి, మరో వ్యక్తికి, పద్మశాలి వీధిలో ఓ యువతి, 10 నెలల బాలుడు, కూరగాయల మార్కెట్‌ ఏరియాలో ఓ యువకుడికి, వాగుగడ్డలో ఓ వ్యక్తికి, మంథనిలో నివాసముంటున్న ఎన్టీపీసీ, గోదావరిఖని, పెద్దతూండ్ల, కన్నాల గ్రామ వాసులకు ఒక్కోక్కరికి కరోనా నిర్థారణ అయింది. 


ధర్మారం మండలంలో ముగ్గురికి..  

ధర్మారం మండలంలో మంగళవారం ముగ్గురికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. ఆయా గ్రామ పంచాయతీ వీధుల్లో సర్పంచ్‌లు సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ర్పే చేపిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. 


రాగినేడులో ఒకరికి.. 

పెద్దపల్లి రూరల్‌ మండలంలోని రాగినేడు గ్రామానికి చెందిన ఒకరికి కరో నా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 


కాల్వశ్రీరాంపూర్‌లో ఐదుగురికి.. 

మండలంలోని పలు గ్రామాల్లో ఐదుగురికి కరోనా సోకింది. పెగడపల్లిలో ఇద్దరికి, కిష్టంపేట్‌, మడిపల్లి, పెద్దరాత్‌పల్లిలో  ఒక్కొ క్కరు వైరస్‌ బారిన పడ్డారు.


‘కాలనీ’లో ఎనిమిది మందికి..

యైుటింక్లయిన్‌కాలనీలో మంగళవారం ఎనిమిది కోవిడ్‌ కేసులు న మోదయ్యాయి. అల్లూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరు పోతన కాలనీ, టీవన్‌, టీటూ ఏరియాలకు చెందిన వారు. సింగరేణి ఆధ్వర్యంలో సెక్టా ర్‌-3 డిస్పెనర్సరీలో 46 మందికి మొదటి రోజు పరీక్షల్లో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 


కరోనాతో జర్నలిస్టు మృతి

కరోనాతో ఓ జర్నలిస్టు మృతి చెందడం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. గోదావరిఖని రమేష్‌నగర్‌కు  వ్యక్తి ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కరీంనగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డు లో చేర్పించి చికిత్స చేయించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.  ఉ మ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ జర్నలిస్టు మృతి తొలిది కావడంతో జర్నలిస్టుల్లో ఆందోళన నెలకొన్నది. 


సంతాపం తెలిపిన జర్నలిస్టు సంఘాలు..

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుకు జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వంశీ, ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్‌, కోశాధికారి దయానంద్‌ గాంధీ, సీనియర్‌ జర్నలిస్టులు పిట్టల రాజేందర్‌, కోల లక్ష్మణ్‌, జక్కం మారుతి, ఎస్‌ కుమార్‌, మాదాసు రామమూర్తి, నాగపురి సత్యనారాయ ణ, జక్కం సత్యనారాయణ, ఎలక్ర్టానిక్‌ మీడియా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి ఆరెళ్లి కుమార్‌, రాజ్‌కుమార్‌, మామిడి సత్యం సంతాపాన్ని తెలి యజేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ జర్నలిస్టు రాంచందర్‌ మరణం తీవ్రంగా కలిచివేసిందని, విధి నిర్వహణలో వారియర్స్‌గా ఉన్న జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


మంథనిలో స్వచ్ఛంద బంద్‌..

కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛ లాక్‌డౌన్‌లో పాల్గొంటున్నాయి. రెండు రోజులుగా పట్టణంలోని అన్ని షాపులు మూసి ఉంటున్నాయి. దీంతో ప్రధాన చౌరస్తాలైన గాంధీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌ ఏ రియాలు మంగళవారం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. 


రామగుండంలో 79 మందికి..

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. స్థానిక సమాచారం మేరకు మంగళవారం ఒక్క రోజే 79 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కార్పొరేషన్‌ పరిధిలోని ఏడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, రామగుండం ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌తో పాటు కరీంనగర్‌లో పరీక్షలు చేయించుకున్న ఈ ప్రాంతానికి చెందిన 48మందికి పాజిటి వ్‌ నిర్ధారణ అయ్యింది. సింగరేణి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు ప్రారంభమయ్యాయి. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు యైుటింక్లయిన్‌కాలనీ డిస్పెనర్సరీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 31మంది కార్మికులకు వైరస్‌ సోకింది. గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో మంగళవారం 202 మం దికి పరీక్షలు నిర్వహించగా 26మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అలాగే యైుటింక్లయిన్‌కాలనీ డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మొత్తం 46 మందికి పరీక్షలు నిర్వహించారు. కార్పొరేషన్‌ పరిధిలో రోజుకు సరాసరి 60 నుంచి 80 పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. సింగరేణి ఆసుపత్రిలో కార్మికులకు పరీక్షలు చేస్తుండడంతో పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. వీరిలో చాలా మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటుండగా కొందరిని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ని ఐసోలేషన్‌ సెంటర్‌లో ఉంచుతున్నారు. 

Updated Date - 2020-08-12T20:18:29+05:30 IST