ప్రకాశం జిల్లాలో విరుచుకుపడిన వైరస్.. తాజాగా ఎన్ని కేసులంటే..

ABN , First Publish Date - 2020-09-20T17:08:34+05:30 IST

జిల్లాలో గత కొద్ది రోజులుగా శాంతించిన కరోనా మళ్లీ విరుచుకుపడింది..

ప్రకాశం జిల్లాలో విరుచుకుపడిన వైరస్.. తాజాగా ఎన్ని కేసులంటే..

ఒంగోలు: జిల్లాలో గత కొద్ది రోజులుగా శాంతించిన కరోనా మళ్లీ విరుచుకుపడింది. శనివారం 1065 కేసులు నమోదయ్యాయి. అందులో ఒంగోలులో అత్యధికంగా 189 ఉన్నాయి. చీరాలలో 53, మార్కాపురంలో 45, కారంచేడులో 42, కందుకూరులో 28, అద్దంకిలో 28, దర్శిలో 17, గుడ్లూరులో 15, చీమకుర్తిలో 11 కేసులు నమోదయ్యాయి. వాటితోపాటు బేస్తవారపేట, పర్చూరు, ఇంకొల్లు, కనిగిరి, పొదిలి, హనుమంతునిపాడుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత రెండురోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురు స్తున్నాయి. దీంతో ప్రజలకు విషజ్వరాలు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొవిడ్‌ ఏమోనన్న భయంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. పరీక్షల కోసం పరుగులు పెడుతున్నారు. 



Updated Date - 2020-09-20T17:08:34+05:30 IST