ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఒక్కరోజే 1,015 కేసులు

ABN , First Publish Date - 2020-08-14T16:09:58+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గురువారం ఒక్కరోజే 1015 కేసులు నమోదయ్యాయి. ఇందులో మేడ్చల్‌

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఒక్కరోజే 1,015 కేసులు

ఒక్కరోజే 1,015 .. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నమోదైన కరోనా కేసులు


(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గురువారం ఒక్కరోజే 1015 కేసులు నమోదయ్యాయి. ఇందులో మేడ్చల్‌ జిల్లాలో 502, వికారా బాద్‌ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 490 కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు జీహెచ్‌ఎంసీ, ఒకరు నాన్‌జీహెచ్‌ఎంసీలో ఉన్నారు. మూడు జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 34,854కు చేరుకుంది. 


కందుకూరులో ఇద్దరికి కరోనా

కందుకూరు: కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో గురువారం 25మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ఆమనగల్లులో ఐదుగురికి..

ఆమనగల్లు ప్రభుత్వ ఆసు పత్రిలో 23మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అందులో నలుగురు ఆమనగల్లుకు చెందినవారు కాగా, ఒకరు నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రబాద్‌కు చెందినవారు ఉన్నారు. తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి పీహెచ్‌సీలో ఏడుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా చంద్రధనకు చెందిన ఇద్దరికి, మాదాయిపల్లికి చెందిన ముగ్గురికి పాజిటివ్‌గా వచ్చింది. తలకొండపల్లి పీహెచ్‌సీలో ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా పడకల్‌ గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


శంషాబాద్‌ మండలంలో..

శంషాబాద్‌ మండలం నర్కూడ పీహెచ్‌సీలో 37మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఆర్‌బీనగర్‌లో ఇద్దరికి, రాళ్లలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే పెద్దషాపూర్‌ పీహెచ్‌సీలో 9మందికి టెస్టులు నిర్వహించగా శంషాబాద్‌ మధురానగర్‌కు చెందిన ఇద్దరికి, పాల్మాకుల గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది.


పట్నం డివిజన్‌లో 26 మందికి..

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 110మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజిటివ్‌గా వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీలో 41మందికి పరీక్షలు చేయగా 10 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇబ్రహీంపట్నంలో 16మందికి పరీక్షలు చేయగా 9మందికి పాజిటివ్‌ వచ్చింది. దండుమైలారం పీహెచ్‌సీలో ఆరుగురికి పరీక్షలు చేయగా ఇద్దరికి, మంచాల పీహెచ్‌సీలో 9మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి, ఆరుట్ల పీహెచ్‌సీలో నలుగురికి పరీక్షలు చేయగా ఒకరికి, ఎలిమినేడు పీహెచ్‌సీలో 10మందికి పరీక్షలుచేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌ డివిజన్‌లో 182మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఏడుగురు షాద్‌నగర్‌ పట్టణానికి చెందినవారు ఉండగా, ఐదుగురు కేశంపేట మండలం, నలుగురు కొత్తూర్‌ మండలానికి చెందిన వారున్నారు. మిగతా ఐదుగురు ఇతర మండలాలకు చెందిన వారున్నారు.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ జిల్లాలో కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం తాండూరులో 11, బషీరాబాద్‌లో 6, వికారాబాద్‌లో 2, కొడంగల్‌లో 2, యాలాల్‌లో 2, మర్పల్లి, దోమ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 


శామీర్‌పేటలో పీహెచ్‌సీలో 10 కేసులు

శామీర్‌పేట పీహెచ్‌సీహహలో గురువారం 115మందికి కరోనా పరీక్షలు చేయగా 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. మజీద్‌పూర్‌ 3, శామీర్‌పేట 1, అలియాబాద్‌ 1, రిసాలబజార్‌ 2, అంతాయిపల్లి 1, లోతుకుంట 1, తూంకుంట 1 కేసులు నమోదయ్యాయి. 


ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా..

బషీరాబాద్‌ పీహెచ్‌సీలో ఏడుగురికి కరోనా పరీక్షలు చేయగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి, మరో కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

Updated Date - 2020-08-14T16:09:58+05:30 IST