తల్లడిల్లిన తణుకు.. ఒక్క రోజే ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..

ABN , First Publish Date - 2020-09-04T18:20:46+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నది. గురువారం ఒక్క రోజే 1205 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 43,739కు చేరింది.

తల్లడిల్లిన తణుకు.. ఒక్క రోజే ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..

ఒక్కరోజే 161 కరోనా కేసులు

జిల్లా అంతటా 1,205 మందికి పాజిటివ్‌  

334కు చేరిన మరణాలు


ఏలూరు (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నది. గురువారం ఒక్క రోజే 1205 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 43,739కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా 161 కేసులు తణుకులోనే నమోదయ్యాయి. బుధవారం కూడా తణుకులో ఇదేస్థాయిలో కేసులు వెలుగు చూశాయి. దీనితో తణుకు తల్లడిల్లిపోతున్నది. 87 కేసులు భీమవరంలో నమోదయ్యా యి. ఇటీవల తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యే జంగా రెడ్డిగూడెం మండలంలో గురువారం 76, ఏలూరులో 46, పాలకొల్లు 38, నరసాపురం 37, కొవ్వూరు 20, నిడదవోలు 14, తాడేపల్లిగూడెం 13 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ మండలాల్లో ఉండ్రాజవరంలో 45, భీమడోలు 37, గణపవ రం 37, ద్వారకాతిరుమల 34, పెరవలి 32, తాళ్ళపూడి 29, ఇరగవరం 28, పెనుమంట్ర 27, అత్తిలి 26, ఉండి 24, ఉంగుటూరు 19 కేసులు వచ్చాయి. 


ఆచంట, టి నరసాపురం, నల్లజర్ల, బుట్టాయగూడెం, కామవరపుకోట, పోలవరం మండలాల్లో 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆకివీడు, మొగల్తూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ మండ లాల్లో పదికి పైగా కేసులు వచ్చాయి. దెందులూరు, చింతల పూడి, జీలుగుమిల్లి, పెదవేగి, గోపాలపురం, కాళ్ళ, లింగ పాలెం, కొయ్యలగూడెంలలో పదికంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది 60 ఏళ్లు దాటిన వారిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లాలో గురువారం ఏడుగురు మరణించారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 334కు చేరుకున్నది. కానీ అధికారిక లెక్కల్లో మరింత ఎక్కువగా ఉన్నాయి. 

Updated Date - 2020-09-04T18:20:46+05:30 IST