Abn logo
Aug 5 2020 @ 12:19PM

కట్టుతప్పుతున్నారు.. నిబంధనల సడలింపులతో పెరిగిన రద్దీ

జిల్లా కార్యాలయాల్లోనూ కరోనా భయం

అంత్యక్రియలను అడ్డుకుంటే శిక్ష తప్పదని హెచ్చరిక


ఏలూరు(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా తన విశ్వరూపాన్ని చూపుతోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో అనేకచోట్ల ప్రజలు కరోనాను ఖాతరు చేయకుండా కట్టుతప్పు తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు సడ లింపులిచ్చారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో రద్దీ అధికమవుతోంది. కొన్నిచోట్ల మాస్క్‌లు కూడా ధరించడం లేదు, ఇక భౌతిక దూరం గురించి చెప్పనక్కర్లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. మద్యం ప్రియులు క్యూలో నిలబడి ఎగబడుతున్నారు.


‘సమగ్ర శిక్ష’ను తాకిన కరోనా

కరోనా ఎఫెక్ట్‌ సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయాలన్ని తాకడంతో కార్యాల యంలోని ఉద్యోగులు హడలిపోతున్నారు. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరికి ఇటీవల పాజిటివ్‌ సోకింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖను అభ్యర్థించినప్పటికీ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన అధికమైంది.


భీమవరం పట్టణంలో 43 కేసులు

పట్టణంలో మంగళవారం 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాధితులను కేర్‌ క్వారంటైన్‌కు తరలించారు. ఆయా వార్డుల్లో శానిటేషన్‌తోపాటు కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటుచేసి ఇతరులు బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప పీహెచ్‌సీ పరిధిలో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తుందుర్రు, గొల్లవానితిప్ప పీహెచ్‌సీ వైద్యు లు నివేదిత, సుగుణరాజులు తెలిపారు.


చింతలపూడి నియోజకవర్గంలో..

లింగపాలెం మండలంలోని భోగోలులో 2, వెంకటాపురంలో 8 కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. కామవరపు కోటలో ఒక మహిళా ఉద్యోగినికి కరోనా సోకినట్టు ఎంపీడీవో డీవీఎస్‌ పద్మిని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 16 కేసులు నమోదయ్యాయి.


పాలకొల్లు నియోజకవర్గంలో..

పాలకొల్లు పట్టణంలో మంగళ వారం 10 కరోనా కేసులు నమోదైనట్టు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నోడల్‌ అధికారిణి ఎస్‌.సింఽధూరి తెలిపారు. మండలంలో ఆరు కరోనా కేసులు నమోదైనట్టు లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నోడల్‌ అధికారిణి డాక్టర్‌ ఎం.గంగా భవాని తెలిపారు. యలమంచిలి మండలంలో దొడ్డిపట్ల, యలమంచిలి పీహెచ్‌సీల పరిధిలో ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. కలగంపూడి 2, వడ్డిలంక ఒకటి, దొడ్డిపట్లలో నలుగురికి కరోనా సోకగా పాలకొల్లు కొవిడ్‌ కేర్‌సెంటర్‌కు తరలించామని వైద్యులు తెలిపారు.


తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో..

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మంగళవారం  8 కేసులు నమోదయ్యాయి.పట్టణ  12, 20 వార్డుల్లో ఒక్కో కేసు, మాధవరంలో 4, కుంచనపల్లి 1, పెంటపాడు మండలం ముదునూరులో ఒక కేసు చొప్పున నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ను ఏర్పాటుచేశారు.


తణుకు నియోజకవర్గంలో..

తణుకు మండలంలో 5 కేసులు నమో దైనట్టు అధికారులు వెల్లడించారు. తేతలిలో 2, కొమరవరంలో 1, వేల్పూరులో 2 కేసులు నమోదయ్యాయన్నారు. తణుకు పట్టణంలోని హైస్కూల్‌ గ్రౌండ్‌ వద్ద నిర్వహించిన కరోనా పరీక్షల్లో 14 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా పట్టణానికి చెందిన ఐదుగురికి, చివటం 2, పైడిపర్రు 3, తేతలి 3, ఇరగవరం మండలం అయితంపూడిలో ఒక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సబ్‌ యూనిట్‌ అధికారి జి.వెంకటేశ్వరరావు తెలిపారు. అత్తిలి మండలంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్‌ ఏవీ రామాంజనేయులు తెలిపారు. కంచుమర్రులో 1, మంచిలిలో 1 చొప్పున నమోదయ్యాయన్నారు. 


నిడదవోలు నియోజకవర్గ వ్యాప్తంగా

పెరవలి మండలంలోని కానూరులో మంగళవారం మూడు కరోనా కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఉండ్రాజవరం మండలంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఎంపీడీవో జీవీ రమణ తెలిపారు. కె.సావరం 1, తాడిపర్రు 1, పాలంగి 1, ఉండ్రాజవరం 1, చివటం 2, సూర్యారావుపాలెం 2 చొప్పున పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. నిడదవోలు పట్టణ, మండలంలో మంగళవారం ఒక్కరోజే 11 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాయిపేటలో 2, వైఎస్సార్‌ కాలనీ 2, గాంధీనగర్‌ 1 చొప్పున మొత్తం 5 కేసులు నమోదు కాగా మండలంలోని పురుషోత్తపల్లిలో 2, డి.ముప్పవరంలో 2, తాడిమళ్ళలో 2 కేసుల చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు.


ఉండి నియోజకవర్గంలో..

కాళ్ల మండలంలో మంగళవారం 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కాళ్ళ ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఈ.నాగార్జున తెలిపారు. బొండాడలో 5, పెదఅమిరం, కలవపూడి, కాళ్ళకూరు గ్రామాల్లో మూడేసి చొప్పున, కాళ్ళ, జువ్వలపాలెంలో రెండేసి, జక్కరంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయన్నారు. ఆకివీడులో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పీహెచ్‌వో వి.మురళీకృష్ణ తెలిపారు.


ఉంగుటూరు నియోజకవర్గంలో..

మండలంలో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. నారాయణపురంలో 7,  కైకరంలో 8, చేబ్రోలు 2, నారాయణపురంలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. గణపవరం మండలంలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కరోనా నియంత్రణ మండలి కమిటీ సభ్యుడు హరి వెంకటేశ్వర్లు తెలిపారు.


ఆచంట నియోజకవర్గంలో..

మండలంలో వేమవరం పీహెచ్‌సీ పరిధిలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైధ్యాదికారులు తెలిపారు. వేమవరంలో-2, ఆచంట-1 పెనుమంచిలిలో-1 చొప్పున నమోదయ్యాయి. పోడూరు మండలంలో 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు పోడూరు పీహెచ్‌సీ వైద్యురాలు ఎస్‌.కీర్తికిరణ్‌ తెలిపారు. కవిటంలో 7, పోడూరు 3, వేడంగి 3, మట్టపర్రు 2, జిన్నూరులో ఒక్కరు చొప్పున మొత్తం 16 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు.


కొవ్వూరు నియోజకవర్గంలో..

కొవ్వూరు పట్టణ, మండలంలో 12 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పట్టణ పరిధిలో ఆరు కేసులు నమోదవగా ఇద్దరు ఆర్డీవో కార్యాలయం సిబ్బంది. మండలంలోని కుమారదేవం రెండు, దొమ్మేరు 2, సీతంపేట 1, పశివేదలలో 1 కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. తాళ్లపూడి మండలంలో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. తాళ్లపూడిలో 2, వేగేశ్వరపురం 3 కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.


వివిధ మండలాల్లో ఇలా..

ద్వారకా తిరుమల మండలంలో ఐదు కరోనా కేసులు నమోదైనట్టు వైద్యుడు బాలు తెలిపారు. పి.కన్నాపురంలో ఒకటి, దేవినేనివారిగూడెంలో రెండు, సత్తెన్న గూడెంలో ఒకటి, రామన్న గూడెంలో నమోదయ్యాయి. టి.నరసాపురం మండ లంలో మరో నాలుగు కరోన పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు మండల వైద్యాధికారి ఎం.శ్రీనివాస్‌ తెలి పారు. నూరు రామన్నపాలెంలో మూడు, మల్లుకుంటలో ఒక కేసు నమోద య్యాయన్నారు. మొగల్తూరు ప్రాఽథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆరుగురికి కరోనా సోకినట్టు వైద్యాధికారిణి డి.దివ్యభారతి తెలిపారు. దేవరపల్లి మండ లంలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలో 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అన్నదేవర పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు కరీష్మ తెలిపారు. వీరి నందరినీ స్థానికంగా ఉన్న కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించారు.అంత్యక్రియలు అడ్డుకుంటే శిక్షార్హులే..

కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు అడ్డుకుంటే భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హులవుతారని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి ధర్మారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా అడ్డుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని బతికున్నవారికి ఎన్ని హక్కులుంటాయో చనిపోయిన వారికీ అవే హక్కులుంటాయని గౌరవ మర్యాదలతో దహన సంస్కారాలు ఆయా మతాచారాల ప్రకారం చేసుకోవ చ్చని తెలిపారు. అయితే దహన కార్యక్రమాల్లో అధికారులు చెప్పే నిబంధనలు పాటించి మాస్క్‌లు, గ్లౌజులు ధరించి శానిటైజర్‌ ఉపయోగించాలన్నారు.


 ఏలూరు పోలీస్‌ శాఖలో నేడు పరీక్షలు?

ఏలూరు క్రైం, ఆగస్టు 4 : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రించడంలో పోలీస్‌ శాఖ ఫ్రంట్‌ వారియర్స్‌గా ఉంది. ఇప్పటికే ఈ శాఖలో పనిచేస్తున్న పలువురు కరోనా వైరస్‌ బారిన పడి కరోనాను జయించి తిరిగి యథావిధిగా విధుల్లోకి చేరారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఒక కీలక విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌, మరో విభాగంలో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌, పోలీస్‌ శాఖల అనుబంధంగా ఉండే విభాగానికి ఉన్న అధికారి ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు వెంటనే వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అధికా రులు, సిబ్బంది బుధవారం పరీక్షలు చేయించుకోవడానికి సమాయత్తమవుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement