జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-04T11:17:02+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు ల సంఖ్య పెరిగింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి రక్త నమూనాలు పంపించగా శుక్రవారం ఒకే రోజు 16

జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు

మరో 16 మందికి పాజిటివ్‌ 

మొత్తం 18కి చేరిన కేసుల సంఖ్య


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు ల సంఖ్య పెరిగింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి రక్త నమూనాలు పంపించగా శుక్రవారం ఒకే రోజు 16 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చినవారితో పాటు ఇతరుల 42 మంది శాంపిళ్లను సేకరించి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపించ గా 16 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు శుక్రవా రం వైద్య అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మూడు ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉంచిన వారికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. వారిని ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తర లిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి నివాస స్థలా ల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు చేపడుతు న్నారు. వీరికి సంబంధించిన వ్యక్తులను క్వారంటై న్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తు న్నారు.


ఇప్పటి వరకు రెండు పాజిటివ్‌ కేసులే న మోదైన జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 18కి చేరింది. జిల్లా నుంచి మొత్తం 42 మంది శాంపిళ్లను పం పించగా 16కి పాజిటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ సి.నా రాయణరెడ్డి తెలిపారు. 25 మందికి నెగిటివ్‌ వ చ్చిందని, మరొకరి రిపోర్ట్‌ రావాల్సి ఉందని తెలి పారు. నెగిటివ్‌ వచ్చిన వారిని కూడా క్వారంటై న్‌లో ఉంచాలని ఆదేశించారు. ఎవరికైనా తీవ్రత గా ఉంటే ఐసోలేషన్‌కు తరలించాలన్నారు. జిల్లా ప్రజలు భౌతిక దూరం పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని కోరారు.

Updated Date - 2020-04-04T11:17:02+05:30 IST