అంతటా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-09T06:32:34+05:30 IST

జిల్లాలో కరోనా తీవ్రత పెరగడంతో వ్యాక్సిన్‌పై దృష్టిపెట్టారు. కొన్ని రోజులుగా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు.

అంతటా పెరిగిన కరోనా కేసులు

 పెంచిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

 టీకా కోసం పీహెచ్‌సీలకు వస్తున్న ప్రజలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కరోనా తీవ్రత పెరగడంతో వ్యాక్సిన్‌పై దృష్టిపెట్టారు. కొన్ని రోజులుగా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో ముందస్తుగా వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది కోవ్యాక్సిన్‌ కోసం చూస్తున్నా జిల్లాకు తక్కువ సరఫరా ఉండడంతో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటున్నారు. జిల్లా లో కరోనా కేసులు మాత్రం ఆగడంలేదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో భా రీగా నమోదు అవుతున్నాయి. ప్రజలతో మమేకమయ్యేశాఖల్లో పనిచేస్తు న్న అధికారులు, సిబ్బంది దీని బారిన పడుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో నిబంధనలు పాటించకపోవడంతో ఎక్కువ మందికి వైరస్‌ సోకుతుంది. 

రెండు నెలలుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. 

రెండు నెలలుగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. మొ దట ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌తో పాటు ఇతర శాఖల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వేశారు. ఆ త ర్వాత కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 45 సంవత్సరాలు దాటిన వారందరికీ ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగతోంది. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు రెండు విడతలుగా కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్య అధికారులు ప్రస్తుతం ఇతర వ్యక్తులకు వేస్తున్నారు. జిల్లాలో 45 సంవత్సరాలు దాటి న వారితో పాటు వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

53,768 మందికి వ్యాక్సినేషన్‌

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 53768 మందికి వేశారు. జిల్లాలో మొదటి నుంచి ఎక్కువగా కోవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నారు. కోవ్యాక్సిన్‌ ఈ మధ్యనే మొదలుపెట్టిన ఎక్కువగా స రఫరా చేయడంలేదు. జిల్లా అంతటా ప్రతిరోజూ అన్ని పీహెచ్‌సీలు, ప్రైవే టు ఆసుపత్రుల పరిధిలో కోవిడ్‌షీల్డ్‌నే వేస్తున్నారు. జిల్లాకు ఇప్పటి వర కు కోవిషీల్డ్‌ వాయల్స్‌ 4862 రాగా 48620 డోస్‌లు వచ్చాయి. వీటిలో ఫస్ట్‌డోస్‌ 38046 మందికి వేయగా సెకండ్‌ డోస్‌ 8485 మందికి ఈ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేశారు. మొత్తంగా జిల్లాలో డోస్‌లను 46531 డోస్‌లను వినియోగించారు. జిల్లాలో మొదటి నుంచి కోవ్యాక్సిన్‌ సరఫరా తక్కువగా ఉంది. జిల్లాకు 448 వాయల్స్‌ మొత్తంగా 8960 డోస్‌లు వచ్చాయి. వీటిలో మొద టి విడత 5514 మందికి వేయగా 2వ విడత 1723 మందికి వేశారు. మొ త్తంగా కోవ్యాక్సిన్‌ 7237 మందికి వేశారు. జిల్లాకు కోవిషీల్డ్‌ మాత్రమే సరఫరా ఉండడంతో ఎక్కువ మంది కోవ్యాక్సిన్‌ను అడుగుతున్న సరఫ రా లేకపోవడంతో కోవిషీల్డ్‌నే వేస్తున్నారు. మొదట త క్కువ మంది వేసుకునేందుకు వచ్చిన ప్రస్తుతం కే సులు పెరుగుతుండడంతో ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. తమ పరిధిలోని పీహెచ్‌సీలకు వెళ్లి వేయించుకుంటున్నారు. డిమాండ్‌ పెరగడంతో అధికారులు కూడా పీ హెచ్‌సీల పరిఽధిలో ఏర్పాట్లను చేసి వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవారితో పాటు మరికొన్ని కేంద్రాలను పెంచి ఇచ్చేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. కరోనా పెరుగుతున్నందు న వ్యాక్సిన్‌ వేసుకుంటే ఇబ్బంది ఉండదని భా వించిన చాలామంది ముందుకు వస్తున్నారు. వై ద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పెరుగుతున్న కేసులు..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తు న్న సిబ్బంది ఎక్కువగా ఈ కరోనా భారిన పడుతున్నారు. మండల, జిల్లాస్థాయి కార్యాలయాలతో పాటు మున్సిపాలిటిల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువగా ఈ కరోనా కేసులు వస్తున్నాయి. వీరితో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారు. ప్రతీ సంస్థలలో టెస్టులు నిర్వహిస్తుంటే భారీగా ఈ కేసులు బయటపడుతున్నాయి. జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంతో పాటు వ్య వసాయశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, మున్సిపాలి టీ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఉద్యోగులు ఈ కరోనా బారినపడ్డారు. శాఖల్లో పనిచేస్తున్నవారికి కరోనా రావడంతో సానిటైజ్‌ చేయడం తో పాటు వారిని కలిసిన  ఉద్యోగులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. వీరితో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా ఉ న్న వైద్య ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూశాఖల్లో పనిచేస్తున్నవారికి కూడా వస్తుండడంతో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ వేసుకోని సిబ్బందికి వేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. 

జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో.. 

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న రెంజల్‌, బోధన్‌, కోటగిరి, వర్ని మండలాల పరిధిలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదు అ వుతున్నాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు బోధ న్‌, ఆర్మూర్‌లో చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్‌ నగరంలోని 9 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరనివారు ఈ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరుతున్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సుమారు 185 మంది చికిత్స కోసం చేరారు.

Updated Date - 2021-04-09T06:32:34+05:30 IST