నూజివీడులో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 72 కేసులు..!

ABN , First Publish Date - 2020-08-04T17:15:34+05:30 IST

నూజివీడు పట్టణంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పట్టణంలో 72 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నూజివీడు పట్టణం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోఉందో చాటిచెబుతోంది.

నూజివీడులో కరోనా  ఉధృతి.. ఒక్కరోజే 72 కేసులు..!

ఒకరి మృతి, ఒకే రోజు 72 పాజిటివ్‌ కేసులు


నూజివీడు(కృష్ణా): నూజివీడు పట్టణంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పట్టణంలో 72 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నూజివీడు పట్టణం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోఉందో చాటిచెబుతోంది. నూజివీడు పట్టణం, నియోజకవర్గంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూ అధికారులకు సవాల్‌ విసురుతోంది. నూజివీడు రూరల్‌ మండలంలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.  కరోనా పాజిటివ్‌కు గురై విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి సోమవారం మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకు నూజివీడు పట్టణంలో అధికారికంగా 362 కేసులు నమోదు కాగా రూరల్‌ మండలంలో 50దాటాయి. ఆగిరి పల్లి మండలంలో 62, ముసునూరు మండలంలో 51, చాట్రాయి మండలంలో 15, నూజివీడు నియోజకవర్గం లో 540 కేసులు అధికారికంగా నమోదు కాగా, అనధికా రికంగా ఇంతకు రెండింతలు గప్‌చి్‌పగా హోమ్‌ క్వారం టైన్‌లో ఉన్నారనే ప్రచారంలో ఉంది. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం పాజిటివ్‌కు గురై హోంక్వారంటైన్‌లో ఉన్న విషయం పచ్చినిజం. 


ఎస్సీ కాలనీ మహిళ మృతి 

పామర్రు బల్లిపర్రు ఎస్సీ కాలనీమహిళ విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తహసీల్దార్‌ సురే్‌షబాబు తెలిపారు. మండలంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు పెరిగిందన్నారు.  మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టామన్నారు. 



మచిలీపట్నం డివిజన్‌లో రెండు కేసులు

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : మచిలీపట్నం డివిజన్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు సోమవారం  నమోదైనట్లు ఆర్డీవో ఖాజవలి తెలిపారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప, మోపిదేవిలో ఒక్కో కేసు  నమోదయ్యాయన్నారు. డివిజన్‌లో సోమవారం నాటికి 768 పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. 


జగ్గయ్యపేటలో మరో 19 

జగ్గయ్యపేటలో మరో 19 మందికి కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. మిట్టగూడెం, కొలిమిబజార్‌, విలియంపేట, ముక్త్యాల రోడ్డు, చెరువుబజార్‌ , శాంతినగర్‌తో పాటు తొర్రగుంటపాలెం, బూదవాడ వాసులకు లక్షణాలు కనిపించాయి. అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.


పెనుగంచిప్రోలు మండలంలో సోమవారం నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ షాకిరున్నిసా బేగం తెలిపారు. అధికారులతో సమీక్ష జరిపారు. ఎంపీడీవో రాజు, వైద్యురాలు సుజనీ, ఏఎస్సై శంకర్‌, కార్యదర్శి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.  ఫ తిరువూరు : పట్టణంలో ఒక మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ స్వర్గం నరసింహారావు తెలిపారు.

Updated Date - 2020-08-04T17:15:34+05:30 IST