Abn logo
Dec 5 2020 @ 10:03AM

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 96 లక్షలు దాటాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,652 కరోనా కేసులు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో 512 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1,39,700కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,09,689 యాక్టివ్ కేసులున్నాయి. 90,58,822 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.03 శాతం కాగా.. మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.


Advertisement
Advertisement
Advertisement