కరోనా కేసులు, మరణాల మధ్య పొంతన లేదు: టీడీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-06T02:33:14+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు, మరణాల మధ్య పొంతనే లేదని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. కరోనా మరణాలు ఎక్కువ జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల

కరోనా కేసులు, మరణాల మధ్య పొంతన లేదు: టీడీపీ ఎమ్మెల్యే

విశాఖపట్నం: జిల్లాలో కరోనా కేసులు, మరణాల మధ్య పొంతనే లేదని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. కరోనా మరణాలు ఎక్కువ జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటెన్‌లో మరణాల సంఖ్యలో చాలా తేడా కనిపిస్తోందని ఆరోపించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. విమ్స్‌లో మంత్రి పర్యటించినప్పుడు వైద్య సిబ్బంది కొరత ఉందని ఆయనే చెప్పారని ఉటంకించారు. విమ్స్, చెస్ట్ హాస్పిటల్‌లో సరైన వసతులు లేవని, సిబ్బంది కొరత ఉందని ఆరోపించారు. మరణాలు, వసతులపై వైద్య నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో వెంటిలేటర్ల కొరత ఉందని, కొత్త వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 


అలాగే కేజీహెచ్ సీ ఆర్ ఎస్ బ్లాక్‌ను ప్రారంభం చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతి ఇస్తే క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేజీహెచ్‌కు అనుమతి ఇవ్వలేదని దుయ్యబట్టారు. దీని వెనుక ఏమైనా రహస్యం ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. కరోనా రిపోర్ట్స్‌ని వేగంగా వెల్లడించాలన్నారు. లేదంటే కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణపై మంత్రి అవంతి దృష్టి పెట్టాలని సూచించారు. గర్భిణీ స్త్రీ ల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కరోనా బాధితులు మరణిస్తే వారిని ఖననం చేయడం కోసం ఊరి శివారుల్లో స్థలం ఏర్పాటు చేయాలన్నారు.

Updated Date - 2020-08-06T02:33:14+05:30 IST