తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-09T01:51:37+05:30 IST

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2606 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2606 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఈ రోజు ఇద్దరు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1583, మేడ్చల్ 292, రంగారెడ్డిలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతంపైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో  కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌లలో సరైన చికిత్స అందక వేలమంది మరణించారు. అయితే, వ్యాక్సినేషన్‌ బాగా జరిగినందున థర్డ్‌ వేవ్‌లో ఆస్పత్రుల పాలయ్యేవారు తక్కువగా ఉంటారని చెబుతున్నా.. పెద్దసంఖ్యలో కేసులోస్తే కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సంబరంగా జరుపుకొనే సంక్రాంతి ముంగిట.. కరోనా ముప్పు కలవరపరుస్తోంది. పండుగకు నగరం నుంచి ఊరెళ్లనున్న వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ప్రమాదం ఉరుముతోంది. వీరి నుంచి గ్రామాలకూ పాకుతుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల మంది వెళ్లి, రానున్న నేపథ్యంలో పరిస్థితి ఎక్కడకు దారితీస్తుందోనని తీవ్ర ఆందోళన రేగుతోంది.

Updated Date - 2022-01-09T01:51:37+05:30 IST