కరోనా కేసుల్లో గందరగోళం.. జిల్లా జాబితాలో ఓ సంఖ్య.. రాష్ట్ర బులిటెన్‌లో మరో లెక్క

ABN , First Publish Date - 2020-07-20T16:45:06+05:30 IST

జిల్లాలోని కరోనా కేసులపై ఈనెల 18న జిల్లా హెల్త్‌ బులిటెన్‌ లో 56 కేసులు నమోదయినట్లు ప్రకటించగా.. రాష్ట్ర హెల్త్‌బులిటెన్‌లో మాత్రం రెండు కేసులు మాత్రం వచ్చినట్లు వెల్లడయింది. ఈ లెక్కన చూస్తే జిల్లా కరోనా కేసుల్లో గందరగోళం నెలకొంటుండడంతో అసలు

కరోనా కేసుల్లో గందరగోళం.. జిల్లా జాబితాలో ఓ సంఖ్య.. రాష్ట్ర బులిటెన్‌లో మరో లెక్క

8 రోజుల లెక్కల్లో జిల్లా జాబితాలో 163.. రాష్ట్ర జాబితాలో 120

ర్యాపిడ్‌ టెస్ట్‌లతో గందరగోళంగా కరోనా లెక్కలు

వైద్య అధికారుల్లో సమన్వయ లోపం

జిల్లా హెల్త్‌ బులిటెన్‌ వెల్లడించమని తెలిపిన డీఎంహెచ్‌వో


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కరోనా కేసులపై ఈనెల 18న జిల్లా హెల్త్‌ బులిటెన్‌ లో 56 కేసులు నమోదయినట్లు ప్రకటించగా.. రాష్ట్ర హెల్త్‌బులిటెన్‌లో మాత్రం రెండు కేసులు మాత్రం వచ్చినట్లు వెల్లడయింది. ఈ లెక్కన చూస్తే జిల్లా కరోనా కేసుల్లో గందరగోళం నెలకొంటుండడంతో అసలు ఎన్ని కేసులు నమోదవుతున్నాయనే ప్రశ్న ప్రజల్లో నెలకొంటుంది. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తుంటే కరోనా సోకిన బాధితుల సంఖ్యలోనూ అధికారుల తీరు ప్రజలను గందరగోళ ంలోకి నెట్టేస్తోంది. ఏ రోజు ఎంత మందికి కరోనా సోకిందనేది ప్రతీరోజు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి, జిల్లా వైద్యశాఖ నుంచి వేర్వేరుగా బులిటెన్‌ విడుద ల చేస్తున్నాయి. తమ ప్రాంతంలో ఎంతమందికి కరోనా వచ్చిందనే ఆసక్తి తో సహజంగానే ప్రజలు సాయంత్రం కాగానే ఈ బులిటెన్‌ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ రెండు బులిటెన్‌లలో తేడా ఉండడం వారిని అయోమయానికి గురి చేస్తోంది. అధికారికంగా వెలువడుతున్న జిల్లాలో కూడా దేనిని నమ్మాలో తెలియక తోచింది ఊహించుకోవడం జిల్లావాసులకు పరపాటిగా మారింది.


బులిటెన్‌లలో ఎంతో తేడా

జిల్లా వ్యాప్తంగా కరోనా ఎంత మందికి సోకిందనే సంఖ్యలో తేడాలు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింభి స్తోంది. ప్రతీరోజు సాయంత్రం జిల్లా వైద్యఆరోగ్య శాఖ, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వేర్వేరుగా బులిటెన్‌ విడుదల చేస్తున్నాయి. ఈ రెండు జాబితాలో బాధి తుల సంఖ్యలో ఎంతో తేడా కనిపిస్తోంది. దీంతో తాము 24 గంటల సమయానికి అనగా సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు సంబంధించిన జాబితాను వెలువరి స్తున్నామని అందుకే తేడా ఉన్నట్లు కనిపిస్తుందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. అయితే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు లెక్కించిన మొత్తం బాధితుల సంఖ్య ఒకే విధంగా ఉండాలి. ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండు జాబితాలను పరిశీలిస్తే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న జాబితాలో కామారెడ్డి జిల్లాలో 120 కేసులు నిర్ధారణ అయితే జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి అదే 8 రోజులలో 163 కేసులుగా నిర్ధారణ కావడం గమనార్హం. ఈ తేడా ఎందుకు ఇంతకు ఏ లెక్కను నమ్మాలనే దానిపై ఏ అధికారి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు.


జిల్లా హెల్త్‌ బులిటెన్‌ ప్రకటన లేనట్లే..

ప్రతీరోజు కరోనా కేసుల వివరాల ప్రకటనపై రాష్ట్ర హెల్త్‌ బులిటెన్‌తో పాటు జిల్లాలోని వైద్య అధికారులు వివరాలను ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కరోనా హెల్త్‌ బులిటెన్‌ను ప్రకటించవద్దని జిల్లా వైద్యఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు డీఎంహెచ్‌ వో చంద్రశేఖర్‌ తెలిపారు. అయితే జిల్లా నుంచి విడుదల కావలిసిన హెల్త్‌ బులిటెన్‌ వైద్యాధికారులు ప్రకటించలేకపోయారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రులలో ఆర్‌టీపీసీఆర్‌ కరోనా టెస్ట్‌లు చేస్తున్నారని అదేవిధంగా మండల స్థాయిలో ని 20 పీహెచ్‌సీల్లోనూ ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులో ఉంచి కరోనా టెస్ట్‌ లు చేయడం జరుగుతుందని ఆయా మండల వైద్యధికారులు వివరాలు ప్రకటిస్తారంటూ డీఎంహెచ్‌వో చెప్పుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభు త్వం కరోనా హెల్త్‌బులిటెన్‌ను విడుదల చేస్తుందన్నారు.

Updated Date - 2020-07-20T16:45:06+05:30 IST