మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-24T04:55:06+05:30 IST

మహారాష్ట్ర సరిహద్దులోని మద్నూర్‌ శివారు లో చెక్‌పోస్టు వద్ద కరోనా నిర్ధారణ పరీక్షలను బుధవారం నుంచి నిర్వహిం చాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులకు సూచించారు.

మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి
నాబార్డు పొటెన్షియల్‌ లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

కామారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 23: మహారాష్ట్ర సరిహద్దులోని మద్నూర్‌ శివారు లో చెక్‌పోస్టు వద్ద కరోనా నిర్ధారణ పరీక్షలను బుధవారం నుంచి నిర్వహిం చాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫ రెన్స్‌లో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వాసులు మహా రాష్ట్రకు వెళ్లివస్తే వారిని క్వారంటైన్‌లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి 6,7,8తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుం దని తెలిపారు. ప్రతీ తరగతి గదిని శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులు మా స్కులు ధరించే విధంగా ఉపాధ్యాయులు చూడాలన్నారు. ప్రతీ ఆరోగ్య కేంద్ర ంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తప్పకుండా చేయాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, డీఆర్‌డీవో పీడీ చంద్రమోహ న్‌రెడ్డి, డీఈవో రాజు, డీపీవో సాయన్న, అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలలో కొవిడ్‌ భద్రత చర్యలు చేట్టాలి

రేపటి నుంచి ప్రారంభమయ్యే పాఠశాలల్లో కొవిడ్‌ భద్రతా చర్యలు చేప ట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ కలెక్టర్‌లకు సూచించారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణ, పారి శుధ్య చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడు తూ జిల్లాలో 6,7,8తరగతులు ప్రారంభమవుతున్నాయని 324 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి 40,597 విద్యార్థులు ఉన్నారని తెలుపుతూ, పాఠ శాలలో కొవిడ్‌ దృష్ట్యా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
రుణ మంజూరులో బ్యాంకర్లు లక్ష్యాలను నెరవేర్చాలి

కామారెడ్డి: వివిధ పథకాల రుణ మంజూరులో బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్యా లను నెరవేర్చాలని కలెక్టర్‌ శరత్‌ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం జనహితభవన్‌లో వివిధ బ్యాంక్‌ మేనేజర్లు, వ్యవసాయ, గ్రామీణ, మున్సిపల్‌ అధికారులతో జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో రుణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి శాంక్ష న్‌ అయిన రుణ మంజూరీలను బ్యాంకర్లు ఈ నెల చివరిలోగా గ్రౌండింగ్‌ పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. జిల్లా కో ఆర్డినేట్‌ కమిటీ సమా వేశంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా నాబార్డు ఏజీఎం నగేష్‌, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ అధికారి రాజేంద్రరెడ్డి, ఆర్‌బీఐ ఎల్‌డీఎం సాయిచరణ్‌, కెనరా బ్యాంక్‌ ఏజీఎం శ్రీనివాస్‌రావు, టీజీటీ మేనేజర్‌ రాజేందర్‌, జిల్లా వ్యవ సాయధికారి భాగ్యలక్ష్మీ, మెప్మాపీడీ శ్రీధర్‌రెడ్డి, డీపీఎంలు శ్రీధర్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎగుమతి చేసేందుకు మౌలిక వసతులను గుర్తించాలి

జిల్లాలో పండే పంటలు, ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు మౌలిక వస తులను గుర్తించాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. మంగళవారం తన చాంబ ర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీజిల్లా, ఒక ప్రొడ క్ట్‌ అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచననుసరించి కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పండే వరి ఽధాన్యం, సోయాబిన్‌లే కాకుండా ప్రెంచ్‌బిన్‌, అటా తదితర ఉత్ప త్తులను ఎగుమతి చేయడానికి కావలసిన వసతులు, అవసరాల పట్ల ఒక వారంలో కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, జిల్లా పరిశ్రమ అధికారి లాలూనా యక్‌, ఎల్‌డీఎం రాజేంద్రరెడ్డి, కేంద్రప్రభుత్వ పారిన్‌ ట్రేడ్‌ డెవల్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎస్‌బీశాస్త్రి, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, ఎంఎస్‌ఏఈ అసిస్టెం ట్‌ డైరెక్టర్‌ రాజేష్‌కుమార్‌, బ్యూరో ఇంటర్‌నేషనల్‌ స్టాండర్స్‌ డీడీ సుధీర్‌, జిల్లా రైస్‌మిల్లర్ల అధ్యక్షుడు గంగాకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-24T04:55:06+05:30 IST