కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి అనిల్‌

ABN , First Publish Date - 2020-04-04T10:25:03+05:30 IST

కరోనా నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి అనిల్‌

నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 3 : కరోనా నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు బయటకు వెళ్లి సరుకులు తీసుకున్న వెంటనే ఇంటికి చేరుకోవాలన్నారు. శుక్రవారం మంత్రి నారాయణ ఆసుపత్రిని పరిశీలించి అక్కడ కరోనా బాధితులకు అందించాల్సిన ఏర్పాట్లను అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. నా రాయణ ఆసుపత్రిలో 500 పడకలు ఏర్పాటు చేశామని అవసరమైతే మరికొన్ని పడకలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


ఆసుపత్రి యాజమాన్యం అన్ని విధాలా స హకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా పాజిటివ్‌లు వచ్చిన ప్రాంతాల ను రెడ్‌జోన్‌లుగా పరిగణిస్తున్నామన్నారు. మరో రెండు వారాలు ప్రజలు ఇళ్లకే ప రిమితమై అధికారులకు సహకరిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్‌, నారాయణ ఆసుపత్రి ఏజీఎం భాస్కరరెడ్డి, డాక్టర్‌ బీజురవీంద్రన్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:25:03+05:30 IST