సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రముఖుల విరాళాలు

ABN , First Publish Date - 2020-04-05T10:44:28+05:30 IST

కరోనా నియంత్రణకు చేపట్టే చర్యలకు తోడ్పాటుగా నగరంలోని ప్రముఖులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు అందించారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రముఖుల విరాళాలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ)/హసన్‌బాద(ద్రాక్షారామ)/రామచంద్రపురం/అనపర్తి, ఏప్రిల్‌ 4: కరోనా నియంత్రణకు చేపట్టే చర్యలకు తోడ్పాటుగా నగరంలోని ప్రముఖులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు అందించారు. కాకి నాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షం లో శనివారం కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డికి చెక్కులు అందజేశారు. మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, చిట్టూరి సూర్యప్రభ రూ.10 లక్షలు, రమ్య ఆసుపత్రి తరపున డాక్టర్‌ పితాని అన్నవరం, డాక్టర్‌ పి.ప్రభావతి రూ.5 లక్షలు, క్రెడాయ్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రసన్న, కార్యదర్శి విజయకృష్ణ రూ.4 లక్షలు, కోకనాడ కాస్మోపాలిటిన్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌వీఎస్‌ రావు, కార్యదర్శి లచ్చన్నచౌదరి రూ.లక్ష, కాకినాడ టౌన్‌హాల్‌ అధ్యక్షుడు పి.శంకరరావు, కార్యదర్శి పి.ఆనం ద్‌ రూ.లక్ష, పెద్దాపురం సెయింట్‌ జాన్స్‌ లూథరన్‌ చర్చి పాస్టర్‌ కేవీ పాల్‌, టి.స్టాలిన్‌ రూ.లక్ష విరాళం అందించారు.


ఎల్పీజీ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సాయిప్రసాద్‌ జేసీ లక్ష్మీశతో కలెక్టర్‌ను కలిసి రిలీఫ్‌ పండ్‌కు రూ.5 లక్షలు అందజేశారు. ఉభయగోదావరి, విశాఖ, కృష్ణ జిల్లాల శెట్టిబలిజ స్టూడెం ట్స్‌ హాస్టల్‌ కన్‌స్ట్రక్షన్‌ కమిటీ కోశాధికారి సీహెచ్‌ కృష్ణమూర్తి రూ .25 వేల చెక్కును డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబుకు అందజేశారు. సీఎం సహాయ నిధికి మానేపల్లి సూర్యనారాయణ రూ. లక్ష చెక్కును రామచంద్రపురం మండలం హసన్‌బాదలో డిప్యూటీ సీఎం బోస్‌కు, రామచంద్రపురంలో పిల్లా సూర్యారావు, విశాల సహకార పరపతి సం ఘం అధ్యక్షుడు దంగేటి వీరభద్రరావు రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ, అనపర్తిలో శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు దుర్గాప్రసాద్‌, సుబ్బారెడ్డి  రూ.50వేల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డికి అందజేశారు.

Updated Date - 2020-04-05T10:44:28+05:30 IST