Abn logo
Sep 25 2021 @ 01:01AM

అవగాహనతోనే కరోనా నియంత్రణ

భువనగిరిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి

 ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి 

భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 24: అవగాహనతోనే కరోనా నియంత్రణ సాధ్యమైందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. భువనగిరి మునిసి పాలిటీలోని 35వ వార్డులో శుక్రవారం నిర్వహించిన వ్యాక్సినేషన్‌ శిబిరంలో ఆయన మాట్లాడారు. అర్హులందరూ విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిం చారు. కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా పరిగణించాలన్నారు. వందశాతం వ్యాక్సినేషన్‌ నమోదు చేసిన 35వ వార్డు ప్రజలు, అధికారులను అభినందించారు. అలాగే 32, 33, 34 వార్డుల్లో నిర్వహించిన శిబిరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమాల్లో మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.పూర్ణచం దర్‌, కౌన్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, ఆవంచిక క్రాంతి, కోళ్ల దుర్గాభవాని, తంగెళ్లపల్లి శ్రీవాణి, వైద్యాధికారులు పాల్గొన్నారు.