Abn logo
Jan 16 2021 @ 17:02PM

కరోనా మరణాల్లేవ్

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో ఏపీలో 8,85,824కి కరోనా కేసులు చేరాయి. అయితే శనివారం రాష్ట్రంలో కరోనా మరణాలేమీ నమోదు కాలేదు. ఇప్పటివరకు కరోనాతో 7,139 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,987 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,76,698 మంది రికవరీ అయ్యారు.


మరోవైపు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రారంభించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్‌ రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం విజయవాడ జీజీహెచ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సీఎం పరిశీలించారు. విజయవాడ జీజీహెచ్‌లో వైద్యసిబ్బందితో సీఎం మాట్లాడారు. టీకా వేయించుకున్నవారితో కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కోసం 332 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
Advertisement