కరోనా మృత్యు కేక

ABN , First Publish Date - 2021-04-21T09:04:47+05:30 IST

కరోనా మృత్యు పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 35 మంది కరోనాకు బలయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,922 శాంపిల్స్‌ను పరీక్షించగా 8,987 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది.

కరోనా మృత్యు కేక

  • -24 గంటల్లో రాష్ట్రంలో 35 మంది మృతి
  • -కొత్తగా 8,987 కేసులు
  • -షార్‌లో 70 మందికిపైగా పాజిటివ్‌ 
  • -కొత్తగా 8,987 మందికి పాజిటివ్‌


అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కరోనా మృత్యు పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 35 మంది కరోనాకు బలయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,922 శాంపిల్స్‌ను పరీక్షించగా 8,987 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,76,987కి చేరుకోగా.. యాక్టివ్‌ కేసులు 53 వేలు దాటేశాయి. నాలుగు జిల్లాల్లో వెయ్యికిపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వైరస్‌ ఒక్కసారిగా విజృంభించింది. నెల్లూరులో కొత్తగా 1,347 మందికి, శ్రీకాకుళంలో 1,344 మందికి వైరస్‌ సోకగా.. గుంటూరులో 1,202, చిత్తూరులో 1063 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 851, కర్నూలులో 758, విశాఖపట్నంలో 675, కృష్ణాలో 441, విజయనగరంలో 330, ప్రకాశంలో 305, కడపలో 297, అనంతపురంలో 275, తూర్పుగోదావరిలో 99 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 3,116 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 9,15,626కి చేరుకుంది. మొత్తం పరీక్షల్లో పాజిటివ్‌లు 24 శాతంపైనే ఉంటున్నాయి.


తాజాగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే 8 మంది మృతిచెందగా.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒకొక్కక్కరు మృతిచెందారు.  సెకండ్‌ వేవ్‌లో మాత్రం తక్కువ వ్యవధిలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజాకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


షార్‌లో  70 మందికి పైగా పాజిటివ్‌ 

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 20: శ్రీహరికోటలోని సతీ్‌షధవన్‌ అంతరిక్ష కేంద్రాన్ని(షార్‌) కరోనా సెకండ్‌వేవ్‌ అతలాకుతలం చేస్తోంది. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్ల(డీడీ)తోపాటు 70 మందికిపైగా ఉద్యోగులకు కరోనా సోకినట్లు సమాచారం. అయితే, షార్‌లో జరుగుతున్న కరోనా పరీక్షల వివరాలు, వాటి ఫలితాలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇటీవల షార్‌ జీరో పాయింట్‌లో రాకెట్‌ అనుసంధాన పనులపై ఓ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులకు కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో షార్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. జీఎ్‌సఎల్వీ ఎఫ్‌-10 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో కరోనా విజృంభిస్తుండటంతో షార్‌ అధికారులు 50ు సాంకేతిక సిబ్బందితోనే పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి సదరు నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-21T09:04:47+05:30 IST