కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే..

ABN , First Publish Date - 2021-06-19T06:37:03+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఆక్సిజన అందక బాధితులు మృతి చెందడం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆరో పించారు.

కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే..
ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించిన టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా

 బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి 

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా

భారీ నిరసన ర్యాలీ - ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు


కళ్యాణదుర్గం, జూన 18: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఆక్సిజన అందక బాధితులు మృతి చెందడం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆరో పించారు. శుక్రవారం స్థానికంగా ఎన్టీఆర్‌ భవన నుంచి ఆర్డీఓ కార్యాల యం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాల యం ఎదుట బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ కరోనా బా రినపడి మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇ వ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు రూ.15 వేలు తక్షణ సహాయం అందజేయాలన్నారు. కరోనా కట్టడిలో సీ ఎం వైఎస్‌ జగన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వేలసంఖ్యలో కరోనా మరణాలు జరుగుతుంటే, పదుల సంఖ్యలో నమోదు చేసి కాకిలెక్కలు చూపడం సిగ్గుచేటన్నారు. కరోనా దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులను ఆదుకునేంటుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీఓ ని శాంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు. 

                         

  నిరసనలో సీనియర్‌ నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, కొల్లప్ప, తలారి సత్యప్ప, రామరా జు, పోస్టు పాలన్న, తిప్పారెడ్డి, ధనుంజయ, మల్లికార్జున, తిమ్మప్పయాద వ్‌, సురేంద్ర, జయరామిరెడ్డి, మల్లారెడ్డి, సురేష్‌, జయరామ్‌, శ్రీరాములు,  వెంకటేష్‌, మంజునాథ్‌, తిమ్మరాజులు, రాజశేఖర్‌చౌదరి, మనోహర్‌, మం జునాథ్‌రెడ్డి, ఆంజినేయులు, నాగరాజు, బీకే రాజ్‌గోపాల్‌, బిక్కి వన్నూర్‌స్వామి, హనుమేష్‌, పెద్దన్న, విరుపాక్షి, బసవరాజు, హరి, న్యాయవాది రా మాంజినేయులు, అంజినప్ప, బోగేష్‌, బొమ్మన్న, ప్రసాద్‌, మోహన, ఓబులేష్‌, ద్రావిడ్‌ కుమార్‌, గోపాల్‌, శీన, అశోక్‌, మధు, మారుతి, సుధాకర్‌, రో షన, చక్రపాణి, పరమేష్‌, లోకే్‌షయాదవ్‌, మహేంద్ర, రవి, బాలరాజు, రా మ్మూర్తి, ఇస్మాయిల్‌, గోవిందరాజులు, చంద్ర పాల్గొన్నారు.  


బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : ఉన్నం 

కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి విమర్శించారు. శుక్రవారం స్థానిక హిందూపురం రోడ్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఉన్నం  మా ట్లాడుతూ  కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతాంగం కుదేలైందని,  రై తులు, రైతుకూలీలు, కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. కరోనా భారిన మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రన్న బీమా ఉండిఉంటే కరోనా మృతుల కు టుంబాలకు లక్షలాది రూపాయల ఆర్థిక సాయం అందేదన్నారు. సీఎం జగన ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని దుయ్యబట్టారు. అన్న క్యాంటీనలు పునరుద్ధరించి కొవిడ్‌ బాధితులతో పాటు పే దల ఆకలి తీర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీఓ నిశాంతరెడ్డికి వి నతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, మాజీ వైఎస్‌ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, అనంతపురం పార్లమెంట్‌ తెలుగు మహి ళా అధ్యక్షురాలు ప్రియాంక, ఉన్నం మారుతిచౌదరి, డీకే రామాంజినేయు లు, మల్లికార్జున, రాయపాటి రామాంజినేయులు, జీవీ ఆంజినేయులు, గో విందరెడ్డి, కొల్లాపురప్ప, గోవిందప్ప, లక్ష్మణమూర్తి, కృష్ణమోహన, నారాయణస్వామి, ఊటంకి రామాంజినేయులు, దొడగట్ట కొండన్న, చంద్రమోహన, రాజేష్‌, బసవరాజు, గోళ్లరాము, హనుమప్ప, తిమ్మారెడ్డి, ములకనూరు కిష్ట, కిషోర్‌, బొజ్జన్న పాల్గొన్నారు. 


పుట్లూరు: కరోనా బాధితులను ఆదుకోవాలని టీడీపీ మండల కన్వీనర్‌ బాలరంగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలవ్యాప్తంగా పదుల సంఖ్యలో కరోనాతో మృతిచెందిన వారిని గుర్తించి బాధిత కు టుంబాలకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌చేశారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన వేయాలన్నారు.  

Updated Date - 2021-06-19T06:37:03+05:30 IST