బ్రిట‌న్‌లో క‌రోనా మ‌ర‌ణాలు 'సున్నా'

ABN , First Publish Date - 2021-05-12T13:07:50+05:30 IST

ఇంగ్లాండ్‌లో సోమవారం కరోనాతో ఒక్క మరణమూ నమోదు కాలేదు. గతేడాది జూలై తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.

బ్రిట‌న్‌లో క‌రోనా మ‌ర‌ణాలు 'సున్నా'

ఉత్తర ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లోనూ సున్నా

లండన్: ఇంగ్లాండ్‌లో సోమవారం కరోనాతో ఒక్క మరణమూ నమోదు కాలేదు. గతేడాది జూలై తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌లో.. పాజిటివ్‌గా తేలిన 28 రోజుల తర్వాత సంభవించిన మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. మరోవైపు ఉత్తర ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లోనూ వైరస్‌ కారణంగా కొత్తగా ఎవరూ మృతి చెందలేదు. వేల్స్‌లో మాత్రం నాలుగు మరణాలు నమోదయ్యాయి. కాగా, మరణాల సంఖ్య జీరోకు రావడం.. లాక్‌డౌన్‌ల అమలు, టీకా పంపిణీ ప్రతిఫలమేనని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా పరిణామాలతో ఆంక్షలను సడలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి ఇళ్ల లోపల రెండు కుటుంబాలు, ఆరుగురు మనుషులు కలిసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

Updated Date - 2021-05-12T13:07:50+05:30 IST