కరోనా ఓడింది.. 90 ఏళ్ల బామ్మ గెలిచింది

ABN , First Publish Date - 2021-05-19T09:16:49+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌లో బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. యుక్త వయస్సు వారు సైతం ఈ మహమ్మారితో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా ఓడింది.. 90 ఏళ్ల బామ్మ గెలిచింది

అది కూడా హోం ఐసొలేషన్‌లో ఉంటూ..

ఎటపాక, మే 18: కరోనా సెకండ్‌ వేవ్‌లో బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. యుక్త వయస్సు వారు సైతం ఈ మహమ్మారితో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. వయస్సు మళ్లిన వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం నందిగామ గ్రామానికి చెందిన పులుసు రాములమ్మ అనే 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. 15 రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్‌ సోకింది. అప్పటి నుంచీ హోం ఐసొలేషన్‌లో ఉంటూ ఏఎన్‌ఎం ఇచ్చిన (కొవిడ్‌ కిట్‌) మందులతో చికిత్స తీసుకుంది. 14 రోజుల తర్వాత మరోసారి కొవిడ్‌ టెస్టు చేయగా నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యంగానే ఉందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2021-05-19T09:16:49+05:30 IST