కార్మికుల కొంప ముంచిన కరోనా!

ABN , First Publish Date - 2020-09-25T08:05:18+05:30 IST

కరోనా మహమ్మా రి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కొంప ముంచింది...

కార్మికుల కొంప ముంచిన కరోనా!

  • 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వారి ఆదాయానికి రూ.259 లక్షల కోట్ల గండి..
  • ఐఎల్‌ఓ వెల్లడి 


ఐక్యరాజ్యసమితి, సెప్టెంబరు 24: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కొంప ముంచింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో కరోనా కారణంగా కార్మికుల ఆదాయం 10.7 శాతం (3.5 లక్షల కోట్ల డా లర్లు.. సుమారు రూ.259 లక్షల కోట్లు) క్షీణించిందని అంతర్జాతీయ కార్మికసంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేస్తోం ది. కొవిడ్‌-19 దెబ్బతో కార్మికుల పని గంటలు తగ్గిపోయాయి. దీంతో వారి ఆదాయం గతేడాది మొదటి తొ మ్మిది నెలలతో పోల్చితే 10.7 శాతం తగ్గిపోయిందని ఐఎల్‌ఓ పేర్కొంది. ప్రభుత్వ చర్యల ద్వారా అందిన ఆ దాయ మద్దతును మినహాయించి ఈ వివరాలు వెల్లడించింది. కాగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో కార్మికుల ఆదాయాల్లో నష్టం అధికంగా ఉందని ఐఎల్‌ఓ పేర్కొంది. ఈ దేశాల్లో కార్మిక ఆదాయ నష్టాలు 15.1 శాతానికి చేరుకున్నాయి. అదే అమెరికాలో ఇది 12.1 శాతంగా ఉంది. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా పని గంటల నష్టం 17.3 శాతంగా ఉంది. ఇది 49.5 కోట్ల పూర్తి స్థాయికి సమానమైన (ఎఫ్‌టీఈ) ఉద్యోగాలకు సమానం. 2020 మూడో త్రైమాసికంలో పని గంటల నష్టాలు 12.1 శాతంగా లేదా 34.5 కోట్ల ఎఫ్‌టీఈ ఉద్యోగాలకు సమానంగా ఉంటాయని అంచనా. నాలుగో త్రైమాసికంలోనూ పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని ఐఎల్‌ఓ ఇంతకు ముందే అంచనా వేసిం ది. ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా పని గంటల నష్టం గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే 8.6 శాతంగా ఉంటుందని అంచనా. ఇంతకు ముందు ఐఎల్‌ఓ అంచనా 4.9 శాతం (14 కోట్ల ఎఫ్‌టీఈ ఉద్యోగాలు)గా ఉంది. 

Updated Date - 2020-09-25T08:05:18+05:30 IST