కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-04-05T11:22:36+05:30 IST

ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా వైరస్‌ మహమ్మారి జిల్లాను సైతం తాకింది. ఇ ప్పటికే జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 73 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారందరిని క్వా రంటైన్‌కు తరలించి వైద్యుల

కరోనా కలకలం

జిల్లాలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు 

73మందికి పరీక్షలు చేయగా.. పది మందికి నిర్ధారణ 

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా 

హైఅలర్ట్‌ను ప్రకటించిన అధికారులు

మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా వైరస్‌ మహమ్మారి జిల్లాను సైతం తాకింది. ఇ ప్పటికే జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 73 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారందరిని క్వా రంటైన్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 73 మంది అనుమానితుల రక్తనమునాలను పరీక్షల నిమిత్తం పంపగా శనివారం పది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన ట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురితో పాటు నేరడిగొండ మండలంలో ముగ్గురు, ఉట్నూర్‌ మండలానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు నిర్ధారణ అయ్యింది. వీరంతా మత ప్రార్థ నల కోసం ఢిల్లీ వెళ్లివచ్చిన వారే కావడంతో జిల్లాలో కలకలం మొదలైంది.


మార్చి 18న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వీ రిని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో ఎందరో మందిని కలిసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. కరోనా బాధితుల్లో ఓ రిమ్స్‌ వైద్యుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లను పకడ్బంధీగా నిర్వహించడం తో ఇన్నాళ్లు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదు కాలేదు. కాని జిల్లాలో పాజిటి వ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రక టించడంతో జిల్లా అంతటా ఉత్కంఠ పరి స్థితులు కనిపిస్తున్నాయి. ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన 124 మందిని గు ర్తించిన అధికారులు వారందరిని క్వారంటైన్‌ కు తరలించారు.


ఇప్పటికే కొందరు 14 రో జుల క్వారంటైన్‌ సమయాన్ని పూర్తి చేసుకున్నారు. కాగా మరో ఎనిమిది మంది బాధితులను రిమ్స్‌ ఆసు పత్రిలోని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యాన్ని అందిస్తున్నా రు. ప్రస్తుతం కరోనా వ్యాధికి సంబంధించి జిల్లాలో తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడడంతో అంత టా కలకలం మొదలంది. లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు మరో 10 రోజుల పాటు ప్రజలు మరింత అ ప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


73 మందికి పరీక్షలు.. పది మందికి పాజిటివ్‌

జిల్లాలో మొత్తం 73 మందికి కరోనా పరీక్షలు ని ర్వహించగా తాజాగా 10మందికి పాజిటివ్‌ నిర్ధారణ అ య్యింది. మిగితా 61 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు తెలు స్తుంది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, నేరడిగొండ మండలాల నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారంతా ఎవరెవరిని కలిసి ఉంటారనే విషయంపై ఆరా తీస్తున్నారు. వారి కు టుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. కాగా 10 మందికి పాజిటివ్‌ అని తేలడంతో వారి కుటుంబ సభ్యులను ప్రభు త్వ కారంటైన్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మిగితా అనుమానితులను గుర్తించేందుకు  వైద్యఆరోగ్య శాఖ ఇంటింటా సర్వేను చేపడుతుంది. అలాగే అనుమానిత వ్యక్తులన క్వారంటైన్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 


ఢిల్లీ యాత్రికుల పై ప్రత్యేక నిఘా

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు నమోదైన గత రెండు, మూడు వారాలుగా జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. దీంతో జిల్లా అంతటా ప్రశాంత వాతావరణమే కనిపించింది. కాని జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో ఒక్కసారి గా అల్లకల్లోలమైంది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించ డంతో అధికారులు వారిపై ప్రత్యేక నిఘా సారించి క్వారంటైన్‌కు తరలించారు. దాదాపు రెండు వారాల పాటు ఈ విషయం పొక్కక పోవడంతో ఢిల్లీ బాధితులు ఎందరో మందిని కలిసినట్లు తెలుస్తుంది.


వీరంతా ఎవరెవరిని కలిసి ఉంటారన్న కోణంలో ఆరా తీస్తున్నా రు. ఇంత జరిగినా ఇంటలిజెన్స్‌ నిఘా విభాగం అధికారులు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయక పోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చెప్పిన సంఖ్య కన్న.. ఎక్కువ మం ది ఢిల్లీ వెళ్లి వచ్చారని గుర్తించారు. మొదట 30 మంది జిల్లా నుంచి వెళ్లారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించగా రెవెన్యూ లెక్కల ప్రకారం 52మందిగా గుర్తించారు. చివరకు 73మంది అనుమానితులను క్వా రంటైన్‌కు తరలించి రక్త పరీక్షలు చేయడంతో జిల్లాలో 10 పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయి. 


జిల్లాలో హైఅలర్ట్‌ను ప్రకటించిన అధికారులు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో సంబంధి త వైద్య శాఖ అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు. కరోనా పాజి టివ్‌గా తేలిన వ్యక్తులు నివాసం ఉంటున్న ప్రాంతాలను  అప్ర మత్తం చేస్తున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని హె చ్చరిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు నేరడిగొండ, ఉ ట్నూర్‌ మండలాల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీ సుకుంటున్నారు. ఇప్పటికే ఉట్నూర్‌లో 30 పడకలు, రిమ్స్‌ ఆసు పత్రిలో 100 పడకలు, ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి అత్యవ సర వైద్యాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.


కరోనా పాజిటివ్‌ గా గుర్తించిన బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగితా వారి ఆరోగ్య పరి స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరో 14 రోజుల పాటు వై ద్యుల పర్యవేక్షణలోనే కరోనా బాధితులు ఉంటారు. లాక్‌డౌన్‌ పూర్త య్యే వరకు అలర్ట్‌గా ఉండాలని జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన అధికారుల ను ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా స్వీయ నియంత్రణను పాటించి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Updated Date - 2020-04-05T11:22:36+05:30 IST