కరోనా ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా

ABN , First Publish Date - 2020-03-24T12:45:28+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరితో శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో వధువరులు

కరోనా ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరితో శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో వధువరులు కూడా తమ పెళ్లికి వాయిదా వేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లాలోని రూరల్‌ మండలంలోని చిట్టిదారి ఖా నాపూర్‌ గ్రామానికి చెందిన పెళ్లి కొడుకు సాయితరుణ్‌, పెళ్లికూతురు సారికలకు ఈ వారం లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న అంకోలి వైద్యసిబ్బంది పంచాయతీ కార్య దర్శి గ్రామానికి వెళ్లి పెళ్లికొడుకు తండ్రిని, పెళ్లికూతురి కుటుంబ సభ్యులను గ్రామంలో కూ ర్చొబెట్టి కరోనావైరస్‌ వ్యాప్తి గురించి వారికి అవగాహన కల్పించారు.


దీంతో ఇరువురు కు టుంబ సభ్యులు అంగీకరించి పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా వల్ల ఈనెల 31 వరకు నిబంధనలు పాటించాలని సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని ప్రభు త్వం ప్రకటించింది. ఈవిషయాన్ని అంకోలి వైద్యసిబ్బంది పంచాయతీ కార్యదర్శి వధువరుల తో ఇరువురి కుటుంబ సభ్యులకు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన కల్పిం చినవారిలో అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్‌ సూపర్‌వైజర్‌ బొమ్మతో సుభాష్‌ హెచ్‌ డబ్ల్యూ సత్యవతి, ఆశాకార్యకర్తలు చందన, అంగన్‌వాడీ కవిత, సునిత, సర్పంచ్‌ రాథోడ్‌ మ మత, గ్రామస్థులు రాజు, చంద్రకుమార్‌, కిషన్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-03-24T12:45:28+05:30 IST