కరోనా విజృంభణ.. ఒక్క రోజే 179 మంది మృతి

ABN , First Publish Date - 2020-09-19T13:17:54+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్‌ విస్తరించాక రికార్డుస్థాయిలో మృతులు పెరిగారు. శుక్రవారం 179 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో స్పష్టం చేసింది. రెండు రోజులుగా

కరోనా విజృంభణ.. ఒక్క రోజే 179 మంది మృతి

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్‌ విస్తరించాక రికార్డుస్థాయిలో మృతులు పెరిగారు. శుక్రవారం 179 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో స్పష్టం చేసింది. రెండు రోజులుగా వైద్యుల సమ్మెతో కొన్ని జిల్లాల ఫలితాలు పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. ఈ ప్రభావం కూడా చోటు చేసుకుంది. 8,626 మందికి శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 3,623 మందికి పాజిటివ్‌ నిర్ధారణకావడంతో ఇక్కడ 1,87,705 మందికి చేరారు.  మైసూరులో 600 మందికి వైరస్‌ సోకడంతో 28,677మంది అయ్యారు. ఉడుపిలో 493మందికి వైరస్‌ నిర్ధారణ కా గా ఇక్కడ 14,891మంది అయ్యారు. దక్షిణకన్నడ 456మందికి ప్రబలగా 19,322 మంది అయ్యారు. బాగల్కోటెలో 206, బళ్లారి 296, బెళగావి 221, బెంగళూరు గ్రామీణ 112, బీదర్‌ 46, చామరాజనగర్‌ 67, చిక్కబళ్ళాపుర 63, చిక్కమగళూరు 109, చిత్రదుర్గ 141, దావణగెరె 146, ధార్వాడ 135, గదగ్‌ 31, హాసన్‌ 173, హావేరి 116, కలబుర్గి 179, కొడగు 44, కోలారు 63, కొప్పళ 176, మండ్య 69, రాయచూరు 116, రామనగర్‌ 70, శివమొగ్గ 257, తుమకూరు 308, ఉత్తరకన్నడ 181, విజయపుర 86, యాదగిరి 143మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 2,725, శివమొగ్గలో 1142, మైసూరులో 883, చిక్కమగళూరు 643, బాగల్కోటె 112, బళ్ళారి 362, బెళగావి 395, బెంగళూరు గ్రామీణ 131, బీదర్‌ 63, చిక్కబళ్ళాపుర 107, చిత్రదుర్గ 184, దక్షిణకన్నడ 340, దావణగెరె 466, ధార్వాడ 134, గదగ్‌ 182, హాసన్‌ 317, హావేరి 465, కలబుర్గి 202, కొడగు 141, కోలారు 93, కొప్పళ 277, మండ్య 381, రాయచూరు 186, రామనగర్‌ 127, తుమకూరు 376, ఉడుపి 268, ఉత్తరకన్నడ 105, విజయపుర 77, యాదగిరి 75 మంది కోలుకోగా చామరాజనగర్‌ జిల్లాలో ఒకరు కూడా డిశ్చార్జ్‌ కాలేదు.


179మంది మృతి 

రాష్ట్రవ్యాప్తంగా 179 మంది మృతి చెందారు. బెంగళూరులో 37, బళ్ళారి 25, శివమొగ్గ 18, మైసూరు 17, దక్షిణకన్నడ 11, ధార్వాడ 9, బెళగావి, కొప్పళలలో 8మంది చొప్పున, బెంగళూరు గ్రామీణలో ఏడుగురు, హావేరి, కలబుర్గిలలో ఆరుగురు చొప్పున, ఉడుపిలో ఐదుగురు, ఉత్తరకన్నడ, కొడగు, చిక్కమగళూరు, బాగల్కోటెలో ముగ్గురు చొప్పున, గదగ్‌, మండ్యలలో ఇరువురు చొప్పున, విజయపుర, రాయచూరు, హాసన్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 814 మంది ఐసీయూలో చికిత్సలు పొందుతున్నారు. తాజాగా 8,626 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 5,02,982 మంది బాధితులయ్యారు. 10,949 మంది తాజాగా కోలుకోగా ఇప్పటివరకు 3,94,026 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా 179మందితో కలిపి 7,808మంది మృతి చెందారు. 1,01,129మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 41,914మంది మైసూరులో 5,596మంది, బళ్ళారిలో 4,783, దక్షిణకన్నడ 4505మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-09-19T13:17:54+05:30 IST