ప్రైవేట్‌ టీచర్లపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-04-05T10:21:37+05:30 IST

జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూళ్ల టీచర్లపై కరోనా ఎఫెక్ట్‌ పడింది.

ప్రైవేట్‌ టీచర్లపై కరోనా ఎఫెక్ట్‌

జీతాలు అందక  9వేల మంది విలవిల     

ఇవ్వలేమని చెబుతున్న యాజమాన్యాలు 


గుజరాతీపేట, ఏప్రిల్‌ 4 : జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూళ్ల టీచర్లపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. విద్యా సంవత్సరం దాదాపుగా పూర్తవుతున్న సమయంలో గత నెల 22న జనతా కర్ఫ్యూ, 23 నుంచి లాక్‌డౌన్‌ను అ మలు చేయడంతో స్కూళ్లు పూర్తిగా మూతప డ్డాయి. పైగా 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా పైతర గతులకు ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణ యించింది.


దీంతో ఈ ఏడాది విద్యాసంవత్సరం దాదాపుగా ముగిసి వేసవి సెలవులు కూడా ప్ర కటించే పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలోని సు మారు 596 ప్రైవేట్‌ స్కూళ్లల్లో పనిచేసే సుమారు 9 వేల మంది ఉపాఽధ్యాయులు,  4వేల మంది సి బ్బందిల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిం ది. అనుకోని విధంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినందున విద్యార్థుల ఫీజులను తల్లి దండ్రులు చెల్లించలేదని ప్రైవేట్‌ స్కూళ్ల యాజ మాన్యాలు  చెబుతున్నాయి. కారణంగా టీచర్లకు, సిబ్బందికి జీతాలు చెల్లించలేమని అంటున్నాయి. దీంతో ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బంది  ఆందోళన చెందుతున్నారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ ప్రైవేట్‌ టీచర్లకు చెల్లించలేదు.  ఇక ఏప్రిల్‌, మే నెలలకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెల కొంది. అవసరమైతే పీఎఫ్‌లో నుంచి  అడ్వాన్స్‌  పొందాలని ప్రైవేట్‌ యాజమాన్యాలు ఉచిత సలహా ఇస్తున్నాయి. మూడు నెలల అనంతరం జూన్‌లో తిరిగి స్కూళ్లు తెరిచినప్పుడు జీతం బకాయిలు చెల్లింపు విషయంలో ఆలోచిస్తామని చెబుతున్నారు.


కాగా కొంతమంది సీనియారిటీ ఉన్న టీచర్లను యాజమాన్యాలు వదులుకోలేక వారికి జీతంలో కొంత కోత విధించి చెల్లిస్తు న్నప్పటికీ కొద్దిపాటి మొత్తం  అవసరాలకు సరి పోదని టీచర్లు లబోదిబో అంటున్నారు. ఇదిలా ఉండగా.. విద్యాసంవత్సరం ముగిసినందున బ స్సుల ఇన్సురెన్సు, విద్యుత్‌ బిల్లులు, ఫైనాన్సు, అద్దెలు వంటి చెల్లింపులు జరిపేందుకు తామే అత్యధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నామని తమ బాధలను యాజమాన్యాలు వెల్లబుస్తున్నాయి. కాగా క్వాలిఫైడ్‌ అయిన టీచర్లకు ప్రభుత్వమే ఏదో ప్రాతిపదికన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనున్నామని చెబుతు న్నారు. జిల్లాలో సుమారు 596 ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లల్లో ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం టీచర్లు 9వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా జీతాలు లేక ప్రస్తుతం వీధిన పడ్డారు. 

Updated Date - 2020-04-05T10:21:37+05:30 IST