కట్టాల్సిందే!

ABN , First Publish Date - 2020-04-05T10:05:44+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో మూడు వారాలు విధించిన లాక్‌డౌన్‌ శ్రమజీవుల పాలిట శరాఘాతమయ్యింది.

కట్టాల్సిందే!

వేతన జీవులు, అసంఘటిత రంగ కార్మికులపై  కరోనా పోటు

 వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు చిట్స్‌ వారి ఒత్తిడి

నెలవారి కట్టాల్సినవి ఎన్నో..

ఇలాంటి ఒత్తిళ్లపై పోలీసులు దృష్టి పెట్టాలి


ఒంగోలు(జడ్పీ), మార్చి 4: కరోనా ఎఫెక్ట్‌తో మూడు వారాలు విధించిన లాక్‌డౌన్‌ శ్రమజీవుల పాలిట శరాఘాతమయ్యింది. జిల్లాలో దాదాపు 80 శాతం మంది ప్రజలు అసంఘటిత రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారే. వీరిలో కూడా 40 శాతం మంది దాకా ఏ రోజుకారోజు సంపాదించుకుని కడుపు నింపుకునే నిరుపేదలేనని గణాంకా లు చెబుతున్నాయి. అయితే ఏప్రిల్‌ నెల మొదలవడంతోనే ఇలాంటి వారి గుండెల్లో గు బులు మొదలయ్యింది. కారణం వీరికి స్థిర ఆదాయం లేకపోవడమే. పని చేసుకుంటేనే వీరి చేతిలో నాలుగు డబ్బులు తిరుగుతుంటాయి. ఇలాంటి వారి జీవితాలన్నీ కరోనా మహ మ్మారి ధాటికి కుదుపునకు లోనవుతున్నాయి. ఆటో కార్మికులు, చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్లపై చిన్న హోటల్స్‌ నడుపుకునే వారు.. ఇలా అన్ని రంగా ల అసంఘటిత కార్మికులు లాక్‌ డౌన్‌ ప్రభావంతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.


వడ్డీ వ్యాపారుల ఒత్తిడి

ప్రభుత్వ ఉద్యోగులకు, నెల జీతం పొందేవారికి, ఇంకే దైనా నిలకడ కలిగిన ఆదాయం ఉన్న వారికి  మాత్రమే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంటా యి. ఇలాంటి సంక్షాభ పరిస్థితుల్లో అలాంటి వారందరికీ రిజర్వ్‌బ్యాంక్‌ షరుతులతో కూడిన మూడునెలల సమ యం ఇచ్చి ఊరట నిచ్చింది. వేతన జీవులకు, అసంఘ టిత కార్మికులకు వారి అవసరాల కోసం వడ్డీ వ్యాపారం చేసే ప్రైవేటు వ్యక్తులే దిక్కు. ఇలాంటి వారి అవసరాల ను ఆసరాగా చేసుకుని వారు నెలవారీగా, రోజువారీగా వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. వీరితో పాటు ప్రైవేటుగా చిట్టీలు కూడా కొంతమంది నిర్వహిస్తుంటారు. ఇలాంటి వ్యాపారాలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. కేవలం అ వసరాల ప్రాతిపదికన జరుగుతూ ఉంటుంది. అంతా స జావుగా ఉండి ఉంటే కొంచెం అటు ఇటుగా శ్రమజీవులు కట్టేసి ఉండేవారు.


కానీ అనుకోని విపత్తు మీద పడడం తో వారి జీవనచిత్రం తారుమారయ్యింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాబిడ్డలను పోషించడమే కష్టంగా ఉంది. ‘‘ప్రతి నెలా గడువుతేదీకే వడ్డీ కట్టేవాడిని. కరోనా వల్ల ఇప్పుడు కట్టలేకపోయాను. కొంచెం సమయం ఇవ్వ మన్నా ఇవ్వట్లేదు. ఏమి చేయాలో అర్థం కావట్లేదు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒంగోలు నగరంలో ని ఓ ఆటో కార్మికుడు తన ఆవేదనను ఆంధ్రజ్యోతి వ ద్ద వెలిబుచ్చాడు.  కార్మికులు వందల సంఖ్యలో ఇలాం టి వారి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘మా కాలనీలోనే ఓ వ్యక్తి దగ్గర చీటీ పాడుకున్నాను. ఆ డ బ్బులతో చిరు వ్యాపారం ప్రారంభించాను. ప్రతినెలా స రిగానే కడుతున్నాను. ఈ నెల వ్యాపారం లేక క ట్టలేకపోయాను. డబ్బులు కట్టాలంటూ నానా గొడవ చే శారు’’ అని ఓ చిరు హోటల్‌ నిర్వాహకుడు వాపోవడం ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. 


అధికారులు దృష్టి సారించాలి

రెక్కాడితే గాని డొక్కాడని వేతన జీవులపై, వారి బాగోగులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవస రముంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికు లకు ఇలాంటి వేధింపుల నుంచి రక్షణ కల్పించే బాఽధ్యత ను కూ డా తీసుకోవాలి. ప్రై వేటు వ్యక్తుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్న వ్య క్తులకు కొంచెం సమయం ఇవ్వాలని, లేని పక్షంలో చ ట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టమైన ఆదేశాలను జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే నిర్విరామంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్న పోలీసు లు ఈ అంశంపై కూడా దృష్టి సారంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


బేల్దారి కార్మికులపై తీవ్ర ప్రభావం

కరోనా వల్ల అధికంగా నష్టపోయిన రంగం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా భవన నిర్మాణ రంగమే. ఈ రంగం మీద ఆధారపడిన కార్మికులు జిల్లాలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. కరోనాకు ముందే ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీతో దాదాపు నెలన్నర రోజులపాటు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రారంభించిన తరువాత మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కార్మికులు కొంచెం తేరుకుంటుండగానే అనుకోని విధంగా కరోనా వారి ఉపాధి అవకాశాలపై మళ్లీ దెబ్బ కొట్టింది. ఇసుక కొరత వల్ల నెలన్నర రోజులు ఖాళీగా ఉన్న కార్మికులకు మళ్లీ లాక్‌డౌన్‌ దెబ్బ వారికి శరాఘాతమైంది. 


 ఇంటి అద్దె కూడా భారం

నెల మొదలవడంతోనే ఇంటి అద్దె కో సం యజమానుల ఒత్తిడి ప్రారంభమయిందని కిరాయిదారులు బెంబేలెత్తి పోతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని వారం పది రోజులు యజమానులు వెసు లుబాటు కల్పిస్తారని, అంతకుమించి వారు కూడా సమ యం ఇవ్వరని అద్దెకు ఉంటున్న వారు ఆందోళన చెందుతు న్నారు. కుటుంబాన్ని గడపడమే కష్టంగా ఉంటే అద్దె ఎలా కట్టాలో అర్థం కావడంలేదని వేతన జీవులు హైరానా ప డుతున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వారిపై అద్దెల కో సం ఒత్తిడి చేయొద్దని ప్రకటనలు చేస్తున్నా కొం తమంది యజమానులు వాటిని పరిగణన లోనికి తీసుకోవడం లేదు.

Updated Date - 2020-04-05T10:05:44+05:30 IST