ఏపీలో కరోనా ప్రభావం పెరుగుతోంది: డీజీపీ

ABN , First Publish Date - 2021-03-29T01:14:08+05:30 IST

ఏపీలో కరోనా ప్రభావం పెరుగుతోందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ స్వీయ

ఏపీలో కరోనా ప్రభావం పెరుగుతోంది: డీజీపీ

విజయవాడ: ఏపీలో కరోనా ప్రభావం పెరుగుతోందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ స్వీయ జాగ్రతలు పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయన హితవుపలికారు. అత్యవసర సందర్భాలలో మాత్రమే బయటకు రావాలన్నారు. ఫంక్షన్స్‌ను తక్కువ మందితో జరుపుకోవాలని లేదా వాయిదా వేసుకోవాలని సవాంగ్‌ సూచించారు.


రాష్ట్రంలో  కొవిడ్‌ మహమ్మారి కమ్ముకొస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారా కాంటాక్ట్స్‌ పెరిగి పాజిటివ్‌లు ఎక్కువైపోతున్నాయి. దీంతో జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతోంది. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం నుంచి రోడ్లపైకి వచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌లు లేనివారికి జరిమానాలు విధించడం ప్రారంభించారు. మొదటిసారి పట్టుబడితే రూ.250, రెండోసారి రూ.500 తప్పదని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-03-29T01:14:08+05:30 IST