కరోనాతో చెవులకూ ముప్పే!

ABN , First Publish Date - 2020-10-19T09:53:20+05:30 IST

కరోనా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని తొలినాళ్లలో శాస్త్రవేత్తలు భావించారు. ఆ తర్వాత జరిపిన

కరోనాతో చెవులకూ ముప్పే!

న్యూఢిల్లీ/లండన్‌, అక్టోబరు 18: కరోనా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని తొలినాళ్లలో శాస్త్రవేత్తలు భావించారు. ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో.. గుండె, కిడ్నీలు, కాలేయంల పనితీరునూ ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని గుర్తించారు. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో చెవి కూడా వైరస్‌ ప్రభావానికి లోనవుతుందని తేలింది. దీనివల్ల పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ వినికిడి శక్తి పోతుందని పరిశోధకులు తెలిపారు.


అయితే అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన నివేదిక బీఎంజే కేస్‌ రిపోర్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సోకిన యువతలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.


ఏప్రిల్‌ - సెప్టెంబరు మధ్యకాలంలో సగటున 44 ఏళ్ల వయసు కలిగిన 201 మంది కరోనా రోగులపై జరిపిన అధ్యయనంలో ఈవిషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-19T09:53:20+05:30 IST