ఆలయాలపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2021-04-17T06:18:10+05:30 IST

కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు పర్యాటక, చారిత్రక విలువలు కలిగిన ఆలయాలను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది.

ఆలయాలపై కరోనా ప్రభావం
లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం వద్ద నోటీసులు

లేపాక్షి, ఏప్రిల్‌ 16: కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు పర్యాటక, చారిత్రక విలువలు కలిగిన ఆలయాలను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా లేపాక్షి పురాతన దుర్గావీరభద్రస్వామి ఆలయాన్ని శుక్రవారం నుండి వచ్చేనెల 15 వరకు మూసివేయాలని ఆ దేశాలు జారీచేసింది. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఈ ఆదేశాలను అమ లు చేశారు. అర్చకులు మాత్రం ప్రతిరోజూ యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని అయితే భక్తులకు ఎటువంటి అనుమతులు  లేవని ప్రవేశాన్ని నిలుపుదలచేశారు. ప్రధాన ద్వారం వద్ద కట్టెలను అడ్డంగా కట్టి నోటీసును అంటించారు. ఆలయంతోపాటు ఏకశిలా నంది విగ్రహం ప్రవేశాన్ని కూడా నిషేదించారు. 

గోరంట్ల: మండల కేంద్రంలోని ప్రసిద్దిగాంచిన శ్రీమాదవరాయ దేవాలయాన్ని రెండో విడత కరోనా విజృంభిస్తున్న కారణంగా పురావస్తుశాఖ అధికారులు శుక్రవారం ఆలయాన్ని మూసివేశారు. శుక్రవారం నుంచి మే 15వరకు నెలరోజులపాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు నోటీసు బోర్డును ఏర్పాటు  చేశారు. 

సజ్జకంఠ రంగనాథస్వామి ఉత్సవాలు నిలిపివేత 

సోమందేపల్లి(పెనుకొండ టౌన): మండలంలోని గుడిపల్లి గ్రామంలో వెలసిన సజ్జకంఠ రంగనాథస్వామి ఉత్సవాలను కరోనా కారణంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రమాకాంత తెలిపారు. శుక్రవారం స్థానిక గ్రామస్థులతో ఆలయం వద్ద సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మకర్త మాట్లాడుతూ ఈనెల 23న ప్రారంభం కావాల్సిన ఉత్సవాలను ప్రస్తుతం నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. తిరిగి ఉత్సవాలు ఎప్పుడు నిర్వహించేది తెలుపుతామని ఆలయ ధర్మకర్త తెలిపారు.






Updated Date - 2021-04-17T06:18:10+05:30 IST